Wednesday, November 6, 2024

సౌందర్యలహరి

23. జగత్సూతే ధాతా హరి రవతిరుద్రఃక్షపయతే
తిరస్కుర్వన్నేతత్స్వమపివపురీశస్తిరయతి
సదాపూర్వస్సర్వంతదిదమనుగృహ్ణాతి చ శివః
తవాజ్ఞామాలంబ్య క్షణ చలితయోర్భ్రూలతికయోః!

తాత్పర్యం: తల్లీ!జగన్మాతా!బ్రహ్మజగత్తునిసృష్టిస్తు ఉంటాడు. విష్ణువు రక్షిస్తూ ఉంటాడు. రుద్రుడు లయం చేస్తూ ఉంటాడు. ఈశ్వరుడు ఈ ముగ్గురిని తన శరీరంలో అంతర్ధానం చేస్తూ ఉంటాడు. సదాశివుడు నీ కనుబొమల కదలికలతో ఇచ్చిన ఆజ్ఞ ననుసరించి ఈ నాలుగు తత్త్వాలని తిరిగి ఉద్ధరిస్తూ ఉంటాడు. అనగా పంచ బ్రహ్మలు నీ సైగల ననుసరించి సృష్టి, స్థితి లయ,తిరోధాన, అనుగ్రహాలని చేస్తూ ఉంటారు.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement