22. త్వయాహృత్వా వామం వపురపరివృత్తేన మనసా
శరీరార్థంశంభోరపరమపి శంకే హృతమభూత్
యదౌతత్త్వద్రూపం సకల మరుణాభంత్రినయనమ్
కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాల మకుటం
తాత్పర్యం: అమ్మా! లోకమాతా! నీ శరీరం లేతఎరుపు వర్ణంతో ప్రకాశిస్తు, అరుణకాంతులను వెదజల్లుతు,మూడుకన్నులతోనూ, కిరీటానికి కలికి తురాయిగా చంద్రవంకని ధరించి,స్తనభారంతో కొద్దిగా వంగినట్టు కనపడుతున్న నిన్నుచూస్తుంటే–శివుడి శరీరంలోసగభాగాన్ని ముందుగా హరించి, దానితో తృప్తిచెందక,కుడిసగాన్ని కూడా హరించావేమో అనే సందేహం కలుగుతోంది.
– డాక్టర్ అనంత లక్ష్మి