20. తటిల్లేఖాతన్వీంతపనశశివైశ్వానరమయీం
నిషణ్ణాంషణ్ణామప్యుపరికమలానాం తవ కలామ్
మహాపద్మాటవ్యాంమృదితమలమాయేన మనసా
మహాంతఃపశ్యంతోదధతిపరమాహ్లాదలహరీమ్.
తాత్పర్యం : అమ్మా! మెరుపుతీగ వలె సూక్ష్మమైన(సన్నదనమే కాక కనిపించే సమయమము కూడా చాలా తక్కువగా కలిగిన)ది, సూర్య చంద్ర అగ్ని తత్త్వాత్మకమైనది, ఆరు చక్రాలకి పైన ఉన్న పద్మాల తోటలో ( సహస్రార కమలము నందు)ప్రకాశిస్తున్నది అయిన నీదైన‘సాదాఖ్య’ కళని కామాది మలినాలు పోగొట్టుకున్న మహానుభావులైన వారు మనస్సుతో (మనోనేత్రంతో) దర్శించి అత్యుత్తమమైన ఆనంద ప్రవాహాన్ని పొందుతున్నారు ( అనుభవిస్తున్నారు).
– డాక్టర్ అనంత లక్ష్మి