Saturday, October 19, 2024

సౌందర్య లహరి

6. క్వణాత్కాంచీదామాకరికలభకుంభస్తననతా
పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్ర వదనా
ధనుర్బాణాన్ పాశం సృణిమపిదధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమధితురాహోపురుషికా!

తాత్పర్యం : చిరు సవ్వడి చేసే చిన్ని చిన్ని గజ్జెలున్న మొలనూలుతో, గున్న ఏనుగల కుంభస్థలముల వంటి స్తనముల బరువుతో కొద్దిగా వంగినట్టు కనపడే సన్నని నడుము కలిగినది,శరదృతువులోని పరిపూర్ణమైన పున్నమి నాటి చంద్రుని వంటి ముఖము కలది, ధనుస్సు, బాణము, అంకుశము, పాశములను నాలుగు చేతులలో ధరించినది,త్రిపురహరుడైన శివుని అహంకారస్వరూపిణి అయిన జగదంబ మా ఎదుట సాక్షాత్కరించు గాక!

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement