6.ధనుఃపౌష్పంమౌర్వీమధుకరమయీ పంచ విశిఖాః
వసంత స్సామంతోమలయమరుదాయోధనరథః
తథా2ప్యేక స్సర్వమ్హిమగిరిసుతేకామపికృపామ్
అపాంగాత్తేలబ్ధ్వాజగదిదమనంగోవిజయతే
తాత్పర్యం: మంచుమలకుమారీ! లోకాలనాన్నింటిని జయించే మన్మథునికున్న సాధన సామాగ్రి ఎంత అల్పమైనదో! అతడికి శరీరమే లేదు. విల్లు సుకుమారమైన పూలతో చేసినది. దాని అల్లెత్రాడుతుమ్మెదల వరుసతో కూర్చినది. బాణాలు ఐదు మాత్రమే. చెలికాడు వసంతుడు. యుద్ధానికి వెళ్ళే రథం మలయమారుతం. అయినా ఒంటరిగా సమస్త జగత్తునుగెలవగలగటానికి నీ కరుణా కటాక్షాన్ని పొందటమే కారణం.
– డాక్టర్ అనంత లక్ష్మి