5. హరిస్త్వామారాధ్యప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్
స్మరో2పి త్వాంనత్వారతినయనలేహ్యేనవపుషా
మునీనామప్యంతఃప్రభవతి హి మొహాయమహతాం
తాత్పర్యం: అమ్మా! నమస్కరించే వారికి సౌభాగ్యాన్ని ప్రాసాదించేదానవైన నిన్ను ఆరాధించి, విష్ణుమూర్తి పూర్వమొకప్పుడు స్త్రీగా మారి,త్రిపురహరుడైన శివుని సైతము మోహమున ముంచి కలత పెట్టాడు. మన్మథుడు కూడ నిన్ను పూజించి నీ అనుగ్రహంతో రతీదేవి కన్నులకు ఆనందాన్ని కలిగించగల రూపంతో, ఇంద్రియాలని జయించి తపస్సు చేసుకుంటున్న మునులను కూడా మోహపరవశులను చేయకల సమర్థుడయ్యాడు కదా!
– డాక్టర్ అనంత లక్ష్మి