Sunday, November 24, 2024

సౌందర్య లహరి

4. తదన్యఃపాణిభ్యామభయవరదోదైవతగణః
త్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయా
భయాత్రాతుందాతుంఫలమపిచ వాంఛా సమధికమ్
శరణ్యే లోకానాంతవహిచరణావేవనిపుణౌ

తాత్పర్యం: సకల లోకాలవారికిశరణ్యమైనదానా!(జననీ!) నీవు కాక ఇతర దేవతలందరు తమ చేతులలో వరద, అభయ ముద్రలని కలిగి ఉంటారు. నీవు ఒక్కదానివే నీ చేతులతో వాటిని అభినయించటం లేదు. భయము లేకుండా రక్షించటానికి, కోరిన వాటిని మించి ప్రసాదించటానికి నీ పాదాలే సమర్థత కలిగి ఉన్నాయి కదా! ( ఇంక చేతులతో ప్రకటించా వలసిన అవసరం లేదు అని అర్థం.)

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement