Monday, November 25, 2024

సౌందర్య లహరి

  1. అవిద్యానా మంతస్తిమిర మిహిర ద్వీపనగరీ
    జడానామ్‌ చైతన్య స్తబక మకరంద స్రుతి రaరీ
    దరిద్రాణామ్‌ చింతామణి గుణనికా, జన్మజలధౌ
    నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి!

తాత్పర్యం: అమ్మా! ( నీ పాదధూళిలోని ఒక పరాగం) అజ్ఞానుల మనస్సులోపలి చీకట్లకు సూర్యుడు ఉదయించు ద్వీపము వంటిది, అలసులు, మందబుద్ధులకు చైతన్యపు పూలగుత్తి నుండి జాలువారు పూదేనెలసోన వంటిది, దరిద్రులకు చింతామణుల పేరు ( దండ) వంటిది, సంసార సముద్రంలో మునిగినవారికి మురాసురుని సంహరించిన విష్ణువు యొక్క అవతారమైన యజ్ఞవరాహపుకోర వంటిది అగుచున్నది.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement