58. మృణాళీమృద్వీనాం తవ భుజలతానాంచతుసృణాం
చతుర్భిస్సౌందర్యంసరసిజభవస్స్తౌతివదనైః
నఖేభ్యస్సంత్రస్యన్ ప్రథమ మథనాదంధకరిపో
శ్చతుర్ణాంశీర్షాణాం సమ మభయహస్తార్పణధియా.
తాత్పర్యం: జగజ్జననీ! ఇంతకు ముందు తన ఐదవ శిరస్సును గోటితో గిల్లివేసినఅంథకాసురుని సంహరించిన శివుడి గోళ్ళకి భయపడిన పద్మసంభవుడైన బ్రహ్మ తన నాలుగుముఖాలతోతామరతూడు వలె మృదువుగా తీగలవలె ఉన్న నీ నాలుగుభుజాల చక్కదనాన్ని చూసి,అభయదానము కోరి నిన్ను తన నాలుగు ముఖాలతో స్తుతిస్తున్నాడు.
– డాక్టర్ అనంత లక్ష్మి