Sunday, January 12, 2025

సౌందర్య లహరి

57. గళే రేఖా స్త్రిస్రోగతిగమకగీతైకనిపుణే
వివాహ వ్యానద్ధప్రగుణగుణసంఖ్యాప్రతిభువః
విరాజంతేనానావిధ మధుర రాగాకరభువాం
త్రయాణామ్గ్రామాణాంస్థితి నియమ సీమానఇవతే.

తాత్పర్యం: సంగీతము నందలి మార్గ,గమక, గానముల యందు మిక్కిలి నైపుణ్యము కల మాతా! వివాహ సమయంలో పెక్కునూలుపోగులతోముప్పేటలుగా కూర్చబడిన సూత్రముల వలె, నానా విధములైన మధురమైన రాగాలకు ఆశ్రయ స్థానములైన షడ్జ, మధ్యమ, గాంధార గ్రామముల ఉనికి యొక్క నియమము కోసం ఏర్పాటు చేసిన సరిహద్దుల వలె నీ కంఠము నందు కనపడుతున్న మూడు అదృష్ట రేఖలు శోభిస్తు ఉన్నాయి.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement