Saturday, January 11, 2025

సౌందర్య లహరి

56. భుజాశ్లేషాన్నిత్యమ్పురదమయితుఃకంటకవతీ
తవ గ్రీవాధత్తేముఖకమలనాళ శ్రియ మియమ్
స్వతశ్శ్వేతాకాలాగురుబహుళజంబాలమలినా
మృణాళీ లాలిత్యం వహతియదధోహారలతికా.

తాత్పర్యం: అమ్మా, నీ కంఠనాళముతామరతూడు వలె అందంగా ఉన్నది. ఎందువలనననగా ముఖము తామరపూవు వలె ఉన్నది. కనుక దానిని ధరించినది తూడు, లేదా కాడ. ఆ కాడవలె ఉన్న కంఠము పురహరుడైన శివుడి బాహువులు కౌగలించుకోవటం వల్ల ఎల్లప్పుడు పులకాంకురాలతోగరుకుగా ఉంటుంది. పైగా అది స్వతస్సిద్ధంగా తెల్లనిది. మొదటిలో అధికమైన నల్లని అగరు అనే బురద కూడా ఉంది. తీగలు అనే ముత్యాల హారాలని కూడా ధరించి ఉంది.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement