Friday, January 10, 2025

సౌందర్య లహరి

55. కరాగ్రేణస్పృష్టంతుహినగిరిణావత్సలతయా
గిరీశే నోదస్తంముహురధరపానాకులతయా
కరగ్రాహ్యంశంభోర్ముఖముకురవృంతంగిరిసుతే
కథంకారంబ్రూమ స్తవ చుబుక మౌపమ్యరహితం

తాత్పర్యం: ఓ గిరిపుత్రీ! తండ్రి అయిన హిమవంతుడిచేత వాత్సల్యపూర్వకంగా మునివేళ్ళతో స్పృశించ బడినది,అధరపానాసక్తియందలితొట్రుపాటు కారణంగా శివుడి చేత ఎన్నోమారులు పైకెత్త బడినది,శివునిచేతులతో గ్రహించ దగినది, పోలిక చెప్పటానికి మరొక వస్తువు లేనటువంటిది అయిన నీ ముఖము అనే అద్దానికి పిడి వలె ఉన్న నీ చుబుకము ను ఏ విధముగా వర్ణించగలను?

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement