54.విపంచ్యాగాయన్తీ వివిధ మపదానం పశుపతే
స్త్వయారబ్ధేవక్తుం చలిత శిరసాసాధువచనే
త్వదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం
నిజాం వీణాం వాణీ నిచుళయతిచోళేననిభృతమ్.
తాత్పర్యం: తల్లీ,సరస్వతీదేవి శివుడి వివిధ సాహసకృత్యాలకి సంబంధించిన చరిత్రలని వీణానాదంతో కలిపి గానం చేస్తూ ఉంటే, ఆనందంతో తల ఊపుతూ, ప్రశంసా వాక్యాలు పలకటం మొదలు పెట్టగానే, ఆ పలుకులు వీణ తీగల నాదమాధుర్యాన్నిఅపహాస్యం చేస్తున్నట్టుగా అనిపించి సరస్వతీదేవి తన వీణావాదనని ఆపి వీణకి ముసుగు కప్పి, కనపడకుండా చేసింది.
– డాక్టర్ అనంత లక్ష్మి