Thursday, January 9, 2025

సౌందర్య లహరి

53. రణేజిత్వాదైత్యానపహృతశిరస్త్రైఃకవచిభి
ర్నివృత్తైశ్చండాంశత్రిపురహరనిర్మాల్యవిముఖైః
విశాఖేంద్రోపేంద్రైశ్శశి విశద కర్పూర శకలాః
విలీయంతేమాతస్తవ వదన తాంబూల కబళా:

తాత్పర్యం: తల్లీ! జగన్మాతా!కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు రాక్షసులని యుద్ధంలో జయించి తిరిగి వస్తు శిరస్త్రాణాలని, కవచాలని తీసి, శివుడి నిర్మాల్యంచండుడుకి చెందుతుంది కనుక దానిని వదలి, జగదంబ దర్శనానికి వచ్చి, జగన్మాత నోటి నుండి తీసి ఇచ్చిన తాంబూలపు ముద్దలను స్వీకరించి, బాగా నమలిమ్రింగటం చేత ఆ తాంబూలపు ముద్దలలో చంద్రుడి లాగ స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్న కర్పూరపు ముక్కలు పూర్తిగా జీర్ణమై విలీనమై పోతున్నాయి.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement