51. స్మితజ్యోత్స్నాజాలం తవ వదనచంద్రస్యపిబతాం
చకోరాణామాసీదతిరసతయాచంచుజడిమా
అతస్తేసీతాంశోరమృత లహరీ రామ్లరుచయః
పిబంతి స్వచ్ఛందం నిశినిశిభృశంకాంచికధియా!
తాత్పర్యం: పార్వతీ దేవీ! నీ ముఖ చంద్రుడి నుండి వెలువడే చిఱునవ్వు అనే వెన్నెలను అంతటినీత్రాగుచున్నచకోరపక్షులకు మిక్కిలి తీపిదనం చేత నాలుకలకి రుచి తప్పిమొద్దుబారటం జరిగింది. అందువలన చకోరపక్షులుపుల్లదనం నందు ఆసక్తి కలిగి, చంద్రుడి వెన్నెల అనే అమృతాన్ని గంజి అనే భ్రమతో ఇచ్చవచ్చినట్టుగాప్రతిరాత్రియందుమిక్కిలిగా త్రాగుతున్నాయి.
– డాక్టర్ అనంత లక్ష్మి