Tuesday, January 7, 2025

సౌందర్య లహరి

ప్రకృత్యా 22 రక్తయా స్తవ సుదతి దంతచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా
న బింబం త్వద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం
తులా మధ్యారోఢుంకథమివ న లజ్జేతకలయా!

తాత్పర్యం: లక్షణమైన పలువరుస కల జగదంబా! సహజముగానే పూర్తిగా ఎర్రదనము గల నీ పెదవుల జంట యొక్క సౌభాగ్యానికి సరైన పోలిక చెపుతున్నాను. పగడపు తీగ పండుని పండించ గలిగితే పోల్చటానికి సరిపోతుంది. దొండపండుసరిపోతుందా అంటే – అది నీ పెదవుల సాన్నిధ్యములో ఉన్నప్పుడు, నీ పెదవుల ఎఱుపు రంగు వాటి మీద ప్రతిఫలించటం వల్ల ఎఱుపుదనాన్ని పొందాయి అని వాటికి ఉన్న ‘బింబము’ అనే పేరే తెలియచేస్తోంది. అటువంటప్పుడు అవి నీ ఎఱ్ఱని పెదవులతో, కనీసము పదునాఱవ వంతు సామ్యం కలిగిన వని చెప్పుకోవటానికి అయినా సిగ్గు పడకుండా ఉంటాయా?

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement