అసౌనాసా వంశ స్తుహిన గిరి వంశధ్వజపటి
త్వదీయోనేదీయఃఫలతుఫలమస్మాకముచితమ్
వహత్యంతర్ముక్తాశ్శిశిరకర నిశ్వాస గళితం
సమృద్ధ్యా య త్తాసాంబహిరపి స ముక్తామణిధరః.
తాత్పర్యం: హిమవంతుని వంశధ్వజానికి పతాకము వంటి దానవైనహైమవతీ, నీ నాసిక అనే వెదురు దండం మాకు తగిన విధముగా కోరికలను ప్రాపింపచేయుగాక. నీ నాసాదండము లోపల ముత్యాలని ధరించి ఉంది. అందువలననే ముత్యముల సమృద్ధి కారణంగా చంద్ర సంబంధమైన వామనిశ్శ్వాస మార్గం ద్వారా ముత్యము ఒకటి బయటికి వెడలి వచ్చి నీ ముక్కు క్రింది కొన యందు ఆభరణమై నిలిచి ఉంది.
– డాక్టర్ అనంత లక్ష్మి