10. సుధాసారాసారైఃచరణయుగళాంతర్విగళితైః
ప్రపంచం సించంతీపునరపిరసామ్నాయమహసః
అవాప్యస్వాంభూమింభుజగనిభమధ్యుష్ఠ వలయం
స్వమాత్మానంకృత్వాస్వపిషికులకుండేకుహరిణి
తాత్పర్యం: అమ్మా! నీ పాదములజంట నుండి జాలువారు అమృతధారాప్రవాహము చేత నాడీమండల మార్గము నంతటిని తడిపి,అమృతరూప కాంతులున్న చంద్రుని వీడి,తామరపూవు బొడ్డు వద్ద ఉండే సన్నని రంధ్రము వంటి చాలా సూక్ష్మముగా ఉన్నటువంటిసుషుమ్నా మార్గపు క్రింది కొస వద్ద ఉన్న నీ స్వస్థానమైన మూలాధారమును చేరి, అక్కడ కుండలినీశక్తివై సర్పము వలె చుట్టలు చుట్టుకొని, నిద్రిస్తూ ఉంటావు.
– డాక్టర్ అనంత లక్ష్మి