1.శివశ్శక్త్యాయుక్తోయదిభవతిశక్తః ప్రభవితుం
న చే దేవం దేవోనఖలుకుశలఃస్పందితుమపి
అతస్త్వామారాధ్యామ్ హరిహర విరించ్యాదిభిరపి
ప్రణంతుంస్తోతుం వా కథ మకృతపుణ్యఃప్రభవతి !!
తాత్పర్యం: (తల్లీ! జగజ్జననీ! ఆదిపరాశక్తీ!)శివునంతటి వాడు శక్తితో ( శక్తి స్వరూపిణివైననీతో) కూడుకొని ఉన్నప్పుడు మాత్రమే సృష్టి కార్యం చేయటానికి సమర్థుడు అవుతున్నాడు. నీతో కలిసి ఉండనప్పుడుకదలుటకు కూడా నేర్పరికాడు. అందువల్ల విష్ణువు,శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలందరి చేత పూజింపదగిన నీకు నమస్కరించటానికి గాని, నిన్ను స్తుతించటానికి గాని పుణ్యము చేయనివాడు సమర్థుడు ఎట్లా అవుతాడు? ( కాడనిభావము)
– డాక్టర్ అనంత లక్ష్మి