Monday, November 25, 2024

సౌభ్రాతృత్వానికి ప్రతిరూపంభగినీ హస్త భోజనం

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతిరూ పం రక్షాబంధనం. అయితే సోదర సోదరీ మణుల సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే పరో పర్వదినాన్ని కూడా అన్నాచెల్లెళ్ల పండగగా జరు పుకుంటాం. అదే భగిని హస్త భోజనం. భగిని’ అంటే చెల్లెలు లేదా అక్క ఎవరైనా కావచ్చు. ‘హస్త భోజనం’ అంటే చేతి భోజనము అని అ ర్ధం. అంటే సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట. ఈ రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్న దమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తారు. దీని నే భగిని హస్త భోజనం అంటారు.
స్మృతి కౌస్తుభం దీన్ని ‘యమ ద్వితీయ’ గానే ప్రకటించింది. సోదరుడి పట్ల సోదరి ప్రేమకు ప్రతీ కగా దీన్ని ‘భ్రాతృ విదియ’గా పరిగణించడమూ పరిపాటి అయింది. చతుర్వర్గ చింతామణి సహా అనేక గ్రంథాల్లో దీని ప్రస్తావన వస్తుంది. సోదరి చేతివంటకు ప్రత్యేకతను, పవిత్రతను ఆపాదిస్తూ ‘భగినీ హస్తాన్న భోజనం’ అని పిలవడం లోకంలో సంప్రదాయంగా స్థిరపడింది. భాతృ విదియ ఒక హందువుల పండుగ. దీనిని కార్తీకమాసము నందు కార్తీక శుద్ధ ద్వితీయ (విదియ) రోజున జరుపుకుంటా రు. మహా రాష్ట్రలో ఈ పండుగను ‘భయ్యా -దూజ్‌’ అని పిలుస్తారు. నేపాల్‌ ప్రాంతంలో ఈ పండుగను ‘భాయి-టికా’ అని పిలుస్తారు. పంజాబ్‌ ప్రాంతం లో ఈ పండుగను ‘టిక్కా’ అని పిలుస్తారు. సోదరులను ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, మిఠాయిలు తినిపించి, ఇష్టమైన పిండి వంటలతో భోజనం పెట్టి ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.
సూర్య భగవానుని కుమారుడు యముడు. ఆయన సోదరి యమి/ యమున. యమునా నది. యమున తన అన్న యముడిని, తన ఇంటికి రమ్మని చాలాసార్లు కోరుతుంది. తీరిక చిక్కని విధి నిర్వహణ మూలంగా ఆమె కోర్కె తీర్చలేకపోతాడు. తుదకు యముడు ఒకనాడు యమున యిం టికి వెళ్తాడు. ఆనాడు కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆమె ఎంతో మర్యాద చేసింది. యమున్ని ఆయన ముఖ్య లేఖకుడైన చిత్రగు ప్తుని, వారి దూతలను పూజించింది. స్వయంగా వంటచేసి అందరికీ వడ్డిం చింది. ఆమె చేసిన మర్యాదలకు సంతృప్తుడైన యముడు చెల్లెలికి ఏదైనా వరం కోరుకోమంటాడు. దానికి ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకాలోక ప్రాప్తి, అపమృత్యు దోషం లేకుండా వరం ప్రసాదించమని కోరింది. ఆమె కోరిన వరాన్ని ప్రసాదిస్తూ యముడు ఎవరైతే ఈనాడు సోదరుని తన ఇంటికి ఆహ్వానించి తన చేతి వంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందక చిరకాలము పుణ్యస్త్రీగా వుంటుందని కూడా వరమిచ్చారు. ఈవిధంగా దీపావళి తరవాత వచ్చే రెం డో రోజును భగిని #హస్తభోజనం పర్వదినంగా జరుపుకోవడం సంప్రదా యంగా వచ్చింది. అలాగే కార్తిక శుద్ధ విదియ పర్వదినాన చిత్రగుప్తుని జయంతి కూడా జరుపుకుంటారు.
చిత్రగుప్తుడి జననం, వంశం, విధి నిర్వ#హణ గురించి పలు పురాణాలు చెబుతున్నాయి. సృష్టి ఆదిలో ఆయువు తీరిన జీవులన్నీ పరలోకం చేరా యి. పాపపుణ్య విచారణలో యముడు తీవ్ర గందర గోళానికి గురయ్యా డు. బ్రహ్మకు తన బాధను మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ ఆలోచిస్తూ సమాధి స్థితిలోకి వెళ్లిపోవడంతో 11 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పు డు ఆయన శరీరం నుంచి నడుముకు ఒక కత్తి కట్టుకుని, కలం, కాగితాల కట్టను చేతుల్లో పెట్టుకుని ఒక దివ్యపురుషుడు ఉద్భవించాడు. బ్రహ్మ ఆయనను యమలోకంలో పద్దుల నిర్వ#హకుడిగా నియమించాడు. ఆయ నే చిత్రగుప్తుడు. కార్తిక శుద్ధ విదియ పర్వదినాన చిత్రగుప్త పూజను జర పాలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఉత్తర భారతదేశం లో వ్యాపారులు చిత్రగుప్త పూజను నిర్వహస్తుంటారు. ఈ రోజున తమ ఆదాయ, వ్యయాల రికార్డులను చిత్రగుప్తుని పటం ముందు ఉంచి ప్రార్థిస్తా రు. బీహార్‌లో జరిపే ఛత్‌ పూజ కూడా చిత్రగుప్తుడికి సంబంధించిందే. ఎర్ర టి వస్త్రంపై కలం, సిరాబుడ్డి, కత్తి, ఖాతా పుస్తకాలను ఉంచి పూజిస్తారు. చిత్ర గుప్త పూజలో పసుపు, తేనె, ఆవాలు, అల్లం, బెల్లం, చక్కెర, గంధం, సిందూ రం సమర్పిస్తారు. కేతువు అనుగ్రహం కోసం ‘ఓం శ్రీ చిత్రగుప్తే నమ:’ అనే మంత్రాన్ని జపిస్తారు. జీవుల సంస్కారాన్ని అనుసరించి వారి పాపపుణ్యా లను లిఖించాలని, చిత్రగుప్తుని బ్ర#హ్మ ఆదేశించినట్లు బృహత్‌ బ్రహ్మ ఖం డంలో ఉంది. యజ్ఞయాగాదుల్లో హవిస్సులు చిత్రగుప్తునికి చెందుతా యని పద్మపురాణం పేర్కొంటోంది. న్యాయ దేవతగా కూడా ఆయనను అభివర్ణించారు. యమ సంహతలో అత్యంత బాధ్యతాయుత విధుల్లో యమునికి సహాయం చేస్తుంటాడని ఉంది. జీవుల పుట్టుక నుంచి మరణం దాకా ప్రతి చర్యనూ నిగూఢంగా పరిశీలించి లిఖిస్తుంటాడు. శారీరక పాపా లతో పాటు మానసిక దోషాలను కూడా సంగ్ర#హంచగలిగే అతీంద్రియ జ్ఞానం ఆయనకు ఉంది. చిత్రగుప్తుడు లెక్క తేల్చిన అనంతరం యమ ధర్మ రాజు ఆ ఆత్మకు తగిన శరీరాన్ని నిర్ణయించి పునర్జన్మను ప్రసాదిస్తాడు.
ప్రస్తుత యాంత్రిక యుగంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవ గాహన, మానవ సంబంధాలు, సంబంధ బాంధవ్యాలు క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి. వాటిని తిరిగి నెలకొల్పడానికి, పునరుద్ధరించడం ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ మళ్లిd వెలుగొందేలా చేయడానికి ఇలాం టి పండుగలు దోహదపడతాయి. అందరూ ఒకరినొకరు ఆత్మీయంగా, ప్రేమ పూర్వకంగా కలుసు కోవడానికి, పలకరించుకోవడానికి వేదికలుగా నిలిచేవి ఇటువంటి పర్వదినాలే.

Advertisement

తాజా వార్తలు

Advertisement