Friday, November 22, 2024

ఘనమైన జ్ఞాపకం శ్రీరామానుజాచార్యులు!

విశిష్టాద్వైత చింతనా మార్గప్రబోధకులు శ్రీరామా నుజాచార్యులు. 11, 12 శతాబ్దాలలో భారత దేశంలో భక్తి మార్గ ప్రవర్తకునిగా ప్రఖ్యాతి గడించారు. ఆ మహానుభావుడి ‘సహస్రాబ్ది వేడుకలు’ అత్యంత భక్తి ప్రపత్తులతో ఘనంగా జరుపుతున్నారు లక్షలాదిమంది భక్తులు. అభిమానులు. వీరిలో శ్రీరామానుజార్యులను ఆదిశేషుని అవతారంగా ఆరాధించి ఆయనను అనుసరించే వర్గం కూడా లక్షలలో ఉన్నారు. వారి దృష్టిలో శ్రీ రామాను జాచార్యులు చిరస్మరణీయమైన, ఘనమైన జ్ఞాప కం. అయితే శ్రీరామానుజాచార్యులను గురించి ఏమీ అవ గాహన లేని కోట్లాదిమంది ప్రజలు కూడా ‘సహస్రాబ్ది వేడుక’ల్లో పాలుపంచుకుంటున్నారు. శ్రీరామానుజార్యులను ఆదిశేషుని అవతారంగా ఆరాధించినా, అంతకంటే ముందు ఒక మనిషిగా శ్రీ రామానుజులు పడ్డ కష్టం, ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించ డానికి, ఆయన, ఆయన అనుయాయూలు పడ్డ పరిశ్రమ మానవాళికి మహత్తరమైన స్ఫూర్తినిచ్చింది. దానిని వెలుగులోనికి తేవడం మానవాళి క్షేమాన్ని కాంక్షించే వారందరి తక్షణ కర్తవ్యం. శ్రీరామానుజులు చేసిన ఘన కార్యాలన్నీ ఆయన ఆదిశేషుడి అవ తారం కావడం వల్లనే చేయగలిగారు, మనలాంటి వారికి ఎలా కుదురుతుంది? అంటూ పెదవులు విరిచేవారున్నారు. అయినా కూడా అటు వంటివారందరికీ రామానుజార్యులు పడ్డ పరిశ్రమ మహ త్తరమైన స్ఫూర్తినిచ్చింది. ‘ఆయన్ని ఆరాధిస్తే చాల్లే’ అంటూ ఆరాధకులుగానే మిగిలిపోకుండా. ఆయన మన కోసమే చేశారు కనుక మనం కూడా ఆయన మార్గాన్ని అనుసరించాలి. ఆచ రించాలి అనుకున్నారు. వెయ్యి సంవత్సరాల క్రితమే మానవాళి క్షేమానికి సమానత్వానికి బాటలు వేసిన సమతా మూర్తి రామానుజులవారు. ఆయన సిద్ధాంతాలను వెలుగులోనికి తేవడం ఇప్పటి మానవాళి క్షేమాన్ని కాంక్షించే వారందరి తక్షణ కర్తవ్యం. ప్రపంచానికి అత్యద్భుతమైన ఆధ్యాత్మిక, తాత్త్విక చింతనను శ్రీరామానుజులు అందించారు. ఆ తాత్త్విక చింతన శ్రీవైష్ణవ సంప్రదాయానికే కాదు. ఇతర వైష్ణవ సంప్రదాయా లకు, శైవ సంప్రదాయాలకు కూడా స్ఫూర్తినిచ్చింది. ఉదాహరణకు 14వ శతాబ్దానికి చెందిన నీలకంఠుడు అనే పండితుడు వ్రాసిన బ్రహ్మసూత్రాలపై శ్రీరామానుజుల ప్రభా వం వర్ణనాతీతం. నీలకంఠుడు రామానుజ దృక్పథాన్ని శైవ మతానికి అనుకూలంగా అర్థవివరణ చేసారు. ఆర్థిక, సామా జిక, రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతల మధ్య అస్థిరత్వంతో, అపనమ్మకంతో ఊగిసలాడుతున్న వర్తమానపు ప్రజలు ‘శ్రీ రామానుజాచార్యుల” ద్వారా లభించే ప్రయోజనాలను తెలుసు కొని ఆయన బాటలో నడవాలి. ”సత్యమైన ధర్మ మార్గాన్ని నిర్ణయించడం చాలా కష్టం. అది లోతైన హృదయాంతరాళ్లో దాగి ఉంది. అందుచేత తెలివైనవారు వివేకవంతులైన తమ పూర్వీకుల బాటను అను సరిస్తారు” అని చెబుతుంది మహాభారతం. ఆ ఇతిహాస వాక్యాన్ని అనుసరించి, శ్రీ భగవద్రామానుజాచార్యులు సూచించిన మార్గాన్ని గుర్తెరిగి అనుసరిస్తే సర్వదా శుభకరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement