పాక్షిక సూర్యగ్రహణం కారణంగా సుప్రభాతసేవ అనంతరం రాజన్న ఆలయంతో పాటు- అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, కేదారేశ్వరాలయాలను కూడా మూసివేయబడుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5.35 గంటల తర్వాత గ్రహణానంతరం పుణ్యాహవచనంతో పాటు- సంప్రోక్షణ చేసి పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. అనంతరం భక్తుల దర్శనాలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు.