శ్రీరామచంద్రమూర్తి వనవాసం స్వీకరించి సీత, లక్ష్మణులతో కలిసి అర ణ్యానికి చేరుకున్నాడు. అక్కడ రాము ల వారికి వనదేవత ప్రత్యక్షమై ”శ్రీరా మా నేనీ వనానికి దేవతని, మీకు సౌకర్యంగా వుండటానికి ఏమి కావా లో కోరుకోమ”ని అడిగిందట. అప్పు డు రాముల వారు ”అమ్మా దారిలో చాలా ముళ్ళు ఉన్నాయి, అవి లేకుం డా చేయి” అన్నారట.
దానికి వనదేవత ”మీరు వచ్చే సారు కదా స్వామీ ఇక తీయవలసిన అసరం ఏముంది?” అని అడిగిందిట
వెంటనే రాములవారు ”భరతుడు న న్ను వెతుక్కుంటూ ఈ మార్గాన వస్తా డు, ముళ్ళని చూసి తట్టుకోలేడు” అ న్నారట.
”అవునా! భరతుడు అంత సున్ని తమైన వాడా?” అని అడిగిందట వన దేవత.
వనదేవత ప్రశ్నకు సమాధానంగా రాములవారు ”కాదు, తనకి ఒక ము ల్లు గుచ్చుకున్నా నాకవి గుచ్చుకుని నొప్పి కలిగించి ఉంటాయనే ఆలోచ నని కూడా తట్టుకోలేడు” అన్నారట.
సోదరుని పట్ల శ్రీరాముని సున్నిత భావన
Advertisement
తాజా వార్తలు
Advertisement