”మాతాచ పార్వతీ దేవీ పితాదేవో మహశ్వర:
బాంధవా: శివ భక్తాశ్చ స్వదేశో భువన త్రయం.”
విశ్వాని కంతటికీ మాతా పితరులు ఆదిదంపతులైన శివపార్వతులు. లోక కళ్యాణార్థం, ధర్మ పరిరక్షణార్థం శ్రీ మహా విష్ణువు దశావతారాలు ధరించినట్లుగా…. శివపా ర్వతులు కూడా దశావతారాలు ధరించినట్లు శైవ పురాణా లు చెబుతున్నాయి. మహాకాలుడు-మహాకాళి, తారకేశ- తారకాదేవి; బాల భువనేశ్వరి; షోడశ విద్యేశ్వర- విద్యే శ్వరి; కాల భైరవ- భైరవీదేవి; భిన్న మస్త- భిన్న మస్తకి; ధూ మవంత- ధూమవతి; బగళాముఖ- బగళాముఖి; మాతంగ- మాతంగి; కమలేశ- కమలిని; అనేవి ఆది దం పతులు ధరించిన దశావతారాలు.
ఇవికాక అమ్మవారు తాను స్వయంగా ”ఇత్థం యదా యదా బాధా దానవోత్థా భవిష్యతి, తదా తదావ తీర్యా హం కరిష్యామరి సంక్షయం ”. ఎప్పుడెప్పుడు దానవుల వలన లోకాలకు బాధ కలుగుతుందో, అప్పుడంతా దుష్ట శిక్షణార్థం నేను అవతరిస్తాను అంటూ చేసిన వాగ్దానం మేరకు స్వయంగా అనేక అవతారాలు ధరించింది. ఆ అమ్మల గన్న యమ్మ. తాంత్రిక సంప్రదాయంలో చెప్పబడిన దశవిధ దుర్గావతారాలలో కాళిక మొద టి అవతారం.
కాళికాదేవిని కాల స్వరూపిణిగా దేవీభాగవతం, దేవీ మాహాత్మ్యం, కాళికా పురాణం, ఉపనిషత్తులు, తాంత్రిక గ్రంథాలు అభివర్ణించాయి. కాళికాదేవి నల్లని దేహచ్ఛాయ కలది. ఈమె భర్త పరమేశ్వరుడు. ఈమె సింహ వాహని. తోడేలు, నక్క, ముంగిసలు కూడా ఈ మె వాహనాలని అంటారు. నేపాల్, బెంగాల్, అస్సాం, దక్షిణ భారత రాష్ట్రాలలో, శక్తి ఆరా ధనా సంప్రదాయాలలో కాళిక కేంద్ర బిందువు. ఉగ్ర రూపముతో, ఎర్రని నాలుకను బయటకుచాచి, కపాల మాలను ధరించి, రెండు కుడిచేతుల లో అభయ వరద ముద్రల ను, రెండు ఎడమ చేతులలో ఖడ్గము, ఖండిత శిరస్సులను దాల్చి కనిపిస్తుంది ఈ తల్లి. పుర్రెల మాల కాలం యొక్క అనంతత్త్వాన్ని, అభయ వరద ముద్రలు ఆర్త రక్షణను, ఖడ్గం, ఖండిత మస్తకం దుష్టశిక్షణను, చాచి ఉన్న ఎర్రని నాలుక కబళించే లక్షణాలను సూచిస్తాయి. భయము, అభయము రెండూ కాల స్వరూపాలే! భయకత్, భయ నాశినిగా దర్శనమిచ్చే కాళీమాత కాల స్వ రూపానికి సంకేతం.
కొన్ని చిత్ర పటాలలో కాళికాదేవి తన కాళ్ళ క్రింద పరమేశ్వరుని త్రొక్కుతూ ఉండడం, లేదా శయన భంగిమలో ఉన్న ఈశ్వరునిపైన కాళికా దేవి ఆసీనురాలై ఉండడం కనిపిస్తుంది. దీనికి వివ రణగా పురాణాలలో మూడు రకాల కథనాలు కని పిస్తున్నాయి. పూర్వం రక్తబీజుడనే లోక కంటకుడై న రాక్షసుడు ఉండేవాడు. బ్ర#హ్మను గురించి ఘో ర తపస్సు చేసి తన దేహం నుండి చిందే ప్రతి రక్త పు చుక్క నుండి వెయ్యి మంది రక్తబీజులు పుట్టుకొ ని వచ్చేలాగా వరాన్ని పొంది, ఆ వర గర్వంతో ఎన్నో దుర్మార్గాలను చేయసాగాడు. అతని బారి నుండి లోకాలను కాపాడమని తనను వేడుకొన్న దేవతల ప్రార్థనలను ఆలకించి దుర్గాదేవి కాళికా రూపంతో రక్తబీజునితో యుద్ధానికి సిద్ధపడుతుం ది. ఆమె ఆ దుష్టుని సంహరించిన ప్రతిసారీ వాని ఒక్కొక్క రక్తపు బొట్టునుండి వేయి మంది చొప్పున రక్తబీజులు పుట్టు కు రావడం గమనించిన కాళికాదేవి రక్తబీజుని వధించి, అతని దేహం నుండి రక్తం నేలపై పడకుండా తన నాలుకను పొడవుగా చాచి ఆ రక్తాన్ని పీల్చేస్తుంది. దీనితో రక్తబీజుని కథ సమాప్తమైంది. లోకాలన్నీ రక్షింపబడి నాయి. కానీ, కాళిక మహోగ్రరూపాన్ని ఉపశమింప చేయడం ఎవరి వల నా సాధ్యపడలేదు. అమ్మవారు మళ్ళీ మామూలు స్థితి పొందాలంటే అది తన స్పర్శతోనే సాధ్యమని గ్రహంచి పరమ శివుడు, కాళికాదేవి ఆగ్రహం తగ్గక చిందులు తొక్కుతున్న మార్గంలో అడ్డంగా పడుకొన్నాడు. తన పా దాలు భర్త అయిన పరమేశ్వరుడి శరీరంపై పడగానే కాళిక ఉగ్ర రూపం విడిచి మామూలు స్థితికి వచ్చి పశ్చాత్తాపం చెందుతుంది. జరిగినదంతా లోక కళ్యాణం కోసమేనని చెప్పి ఆమెను అనునయిస్తాడు శివుడు.
మరొక కథనం ప్రకారం ఒకరోజు ప్రచండ తాండవ నృత్యం చేస్తున్న పార్వతీదేవి పద ఘట్టనలతో లోకాలన్నీ విలవిలలాడిపో యాయట. ప్రమాద నివారణకుగాను శివుడు ఆమె పాదాల క్రిం ద తాను పడుకొని అమ్మవారి నృత్య క్రీడకు తాను వేదికగా మారాడట.
ఇంకొక కథనం ప్రకారం శుంభని శుంభులనే వారి దుష్ట సేనాని కామరూపుడు (తాను కోరుకొన్న రూపం ధరించగల శక్తిసంప న్నుడు) పరమేశ్వరుని వేషం ధరించి పార్వతిని బంధించాల ని పన్నాగం పన్నాడట. అతని కపట వేషాన్ని గ్రహంచిన ఆ తల్లి అతడిని తన పాదాల క్రింద పడవేసి తొక్కగా ఆ రాక్షసుని నిజ రూపం బయట పడిందనీ, అప్పుడామె అతని శిరస్సును ఖండించింద నీ చెప్ప బడింది.
కథనాలు వేరైనా నిగ్రహానుగ్ర హ సంపన్నులైన శివ-శక్తులు చూపిన ఈ లీలాకేళి లోక కళ్యాణార్థమే నని మనం గ్ర#హంచాలి.
శివశక్తుల లీలాకేళి!
Advertisement
తాజా వార్తలు
Advertisement