బాహ్యశుచి కలగనిదే అంతరంగ శుచి సాధ్యము కాదు. ఆధ్యాత్మిక సాధ కునికి మొట్టమొదట స్నానము ఒక విధి.
నన్దికేశ్వర: నైర్మల్యం భావశుద్ధిశ్చ వినా స్నానం నవిద్యతే|
తస్మాన్మనోవిశుద్ద్యర్థం స్నానమాదౌ విధీయతే.
మనో నిర్మలత్వమునకు స్నానము తప్పనిసరి. కావున స్నాన ము సాధకునకు మొట్టమొదటి విధి. నదులు, బావులు అనగా పైకి తీసిన నీరు, తటాకములు వీటిలో స్నానము చేయవచ్చును. నదీ స్నానము పరమ శ్రేష్ఠమని చెప్పుచున్నా రు. భూమి, అంతరిక్షము లో మూడున్నర కోట్ల తీర్థములున్నవని ప్రతీతి. ఏ జలమునందు స్నానమాచరించిననూ పరమ పవిత్రమైన గంగను తలుచుకొ నుట పరిపాటి.
గంగను భూలోకమున నందినిగాను, ద్యులోకమున నళిని గాను, ఇంకనూ దక్షా, పృథ్వీ, విహగా, విశ్వకామా, శివప్రద, వి ద్యాధర, సుప్రసన్న, లోకప్రసాదిని, క్షేమ్య, జాహ్నవి, శాంతి ప్రదా యిని అను నామములతో పూజింపబడుచున్నది. స్నాన సమయ మున ఈ నామములు స్మరించిన వారికి గంగాస్నాన ఫలము చేకూరుచున్నది. తూర్పునకు, పడమరకు, పాతాళమునకు ప్రయాణించుచున్న గంగ త్రిపథగా పేరొందినది.
ఇక గంగాయమునల సంగమ ప్రదేశమయిన ప్రయాగను గురించి ధర్మరాజునకు మార్కండేయ మహాముని సవివరముగా తెలియచేసినారు. మహాభారత యుద్ధానంతరము ధర్మరాజు రాజ్యమును పొంది కూడా భ్రాతృ, బంధుజనము గతించుట పట్ల శోకములో మునిగిపోయినాడు. ఆ సందర్భము లో గంగా-యమునల సంగమం ప్రయాగస్నాన ఫలమును గూర్చి తెలియచే సినారు. ధర్మరాజు దు:ఖముతో స్మరించగా వారణాశిలోనున్న మార్కండేయు డు హస్తినాపురములో ప్రత్యక్షమయినారు. క్షాత్రధర్మమున యుద్ధము చేయు ట పాపము కాదు. తన రాజ్యమును శత్రువుల నుండి కాపాడుకొనుట మరియు రక్షించుకొనుట రాజధర్మము. ఆ యుద్ధమున మరణించిన వారి గురించి చిం తించుట అవివేకము. కావున దు:ఖమును, శోకమును విడిచి కార్యోన్ముఖుడ వుగా నిలువమని మార్కండేయ మహాముని ధర్మరాజుకు సూచించెను. అయిననూ నీ దృష్టిలో పాపవిమోచనము కొరకు మార్గము కోరుచున్నావు. కనుక ప్రయాగ చేరి స్నానమాచరించవలెనని ఆ మహాముని మార్గదర్శనం చేసినారు.
ప్రయాగ పూర్వము ప్రతిష్ఠాన నగరము. దుష్యంతుని రాజధానిగా వెలు గొందినది. ఇచ్చటి గంగను ఆరువేల ధనువులు, యమునను సప్తాశ్వడు అయి న ఆదిత్యుడు ఎల్లవేళలా కాపాడుచుందురు. ఇచట స్నానము చేసినచో స్వర్గప్రా ప్తి. ఇక్కడ మరణించినచో పునర్జన్మ లేదు. ఈ తీర్థమును హరి సకలదేవ సహా యుడై రక్షించుచుండును. ఇచ్చటి వట వృక్షములలో శూలపాణియగు మహేశ్వ రుడు నివశించుచుండును. ఇచ్చట మృత్తికను తాకిన నరులు పాపవిముక్తులగు దురు. ప్రయాగలోని జలమును సేవించిన ఏడు తరముల వారు పవిత్రులగు దురు. సర్వదేవాభిరక్షితమగు ప్రయాగలో ఒక మాసము బ్రహ్మచర్య వ్రతమా చరించి పితృదేవతలకు తర్పణలు ఇచ్చిన వారు ఊర్ధ్వలోక గతులు పొందుదు రు. రవిపుత్రిక, త్రిలోక విశ్రుత, మహాభాగ అయిన యమున ఇక్కడ గంగతో కలియుచున్నది.
ఈ భూమిపై ఎక్కడ ఉన్ననూ మరణ సమయమున ప్రయాగను స్మరించి న వారికి బ్రహ్మలోక ప్రాప్తి, సిద్ధలోక వాసము కలుగును. మనోవాక్కాయ కర్మ ములను ధర్మమునందే నిలిపి గంగాయమునా నదీ ద్వయ మధ్యమున గోవు ను దానమునిచ్చిన దుష్కర్మములు నశించి పుణ్యలోక గతిని పొందును. ఇక్క డ కన్యాదానము చేయువారికి అనంత పుణ్యప్రాప్తి లభించును. ప్రతి కల్పము చివర విష్ణువు ప్రయాగలోనే నిదురించును. బ్రహ్మాది దేవతలు, దిశలు, అధిప తులు, లోకపాలురు, సాధ్యులు, సనత్కుమారాది మహర్షులు, బ్రహ్మర్షులు, యక్షనాగగరుడ సిద్ధచారణులు, విద్యాధరులు, ప్రజాపతులు కూడా ప్రళ యాంతమున ప్రయాగలోనే వసింతురు. ప్రయాగ పృథివి యొక్క జఘన స్థా నము. మకర సంక్రాంతియందు ఇక్కడ స్నానము రాజసూయ, అశ్వమేధ యాగములు చేసినంత ఫలము లభించును.
కోటి తీర్థం సమాసాద్యయసు్తపాణా న్పరిత్యజేత్
కోటిర్వర్ష సహస్రాణాం సర్వలోకే మహీయతే
ఇచ్చటి కోటి తీర్థమున ప్రాణ త్యాగము లభించిన వారు సహస్ర కోటి వత్స రములు స్వర్గ సుఖములు పొందుదురు. తరువాత సంపన్నమగు వంశమున రూపవంతుడై జన్మించును. బహు తీర్థములు, తపోధనులు నిండియున్న ఈ గంగాయమున సంగమ ప్రదేశమున స్నానము సిద్ధిని కలిగించును. అందువ లననే ప్రయాగ ఒక సిద్ధక్షేత్రము. ఎన్ని అస్థిఖండములు గంగయందు నిలుచు నో అతడు అన్నివేల సంవత్సరములు సర్గమున వసి ంచును. గంగ మూము ప్రదేశములలో పుణ్యప్రదాయిని. గంగ ద్వార మయిన హరిద్వారము, గంగా యమునా సంగమము ప్రయాగ, సాగర సంగమ స్థానము ఈ ప్రదేశములలో స్నానము చేయువారు పునరావృత్తిలేని పరమపదమునకు చేరుదురు.
పాప కలుషిత చిత్తులకు, పుణ్యగతి కోరు ఆర్తులకు, గంగానది స్నానమే శరణ్యము. పరమ పవిత్రమైనది, శుభకరి, మహేశ్వరుని శిరము నుండి జాలు వారినది అయిన గంగ కంటే పవిత్రమైనది ఇక ఏదీ లేదు. కావున ప్రయాగను చేరి స్నానమాచరించి గతించిన వారికి తర్పణములు విడువమని మార్కండే య మహాముని ధర్మరాజుకు సూచించినాడు.
దీనినే త్రివేణి సంగమం అంటారు. గంగాయమున- సరస్వతి నదుల కల యికతో ఇది పవిత్రధామముగా ప్రసిద్ధి పొందింది. సరస్వతి నది అంత:ర్వాహి నిగా ఉంది. దీనినే ప్రయాగ్‌రాజ్‌గా పిలుస్తారు. ఆకుపచ్చని రంగులో యమున, గోధుమ రంగులో గంగ కలిసే దృశ్యం మనోహరంగా ఉంటుంది. గంగానది పుష్కరాలు ఏప్రియల్ 22న ప్రారంభమై, మే 3, 2023న ముగుస్తాయి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించగానే గంగా పుష్కరాలు ప్రారంభమవుతా యి. గంగామాత ప్రవహించే మార్గమంతా ఈ పుష్కరాలతో పునీతమవుతుం ది. గంగోత్రి, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్‌నాథ్, ప్రయాగ మొదలగు పుణ్యక్షే త్రాలలో పుష్కర స్నానాలు పరమ పవిత్రమైనవిగా భావించి ఆచరిస్తారు. గం గను తలుచుకొని స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. చిత్తశుద్ధి కలు గుతుంది.