Tuesday, November 26, 2024

శ్యామా భక్తి పరాయణ తత్వం

శిరిడీలో చాలాకాలం నివసించిన నార్కే శ్యామాతో సన్ని హతంగా గడిపేవాడు. పైగా రెండు కుటుంబాలు ఎంతో అన్యోన్యతతో మసలేవి. ఆ చనువు వలనే నార్కే శ్యామా ను, అతనికి సాయికి మధ్య వున్న అంతరంగిక సంబంధం గురించి ప్రశ్నలు వేయగా శ్యామా ఇలా బదులిచ్చాడు-
”మొదట్లో బాబాను చూస్తే పిచ్చి ఫకీరు అనిపించేవా రు. రానురాను ఆయన పట్ల నాకు భక్తిశ్రద్ధలు ఏర్పడ్దాయి. బాబా తరచుగా చిలిం త్రాగేవారు. ఆయన దగ్గరకు వెళ్ళిన ప్పుడల్లా ఆయన చిలిం పీల్చమని నాకు ఇచ్చేవారు. బ్రా హ్మణుడనైనా సాయి చిలిం పీల్చమని ఇచ్చినప్పుడు ఎంతో పవిత్రంగా అనిపించి ఏమాత్రం సంశయం లేక త్రాగేవాడిని. అప్పుడు నా మనసులో మెదిలే సంశయాలన్ని మటుమాయం అయిపోయేవి. శిరిడీలో చాలామంది బాబా చేష్టలను బట్టి దగ్గర కు వచ్చేవారు కాదు కానీ కొంతమందికి ఆయనంటే విశ్వాసం ఏర్పడింది. తాత్యా తల్లి బాయిజీ బాయి, గోండ్‌కర్‌ కుటుంబం, మ#హల్సాపతి, అప్పాకులకర్ణి వంటి వారు తరచుగా బాబా వద్ద కు వస్తుండేవారు. అందరితోపాటు నేను తరచుగా ఆయన దర్శ నం చేసుకునేవాడిని. రానురాను బాబాను దర్శిస్తే నాలో ఏదో తెలి యని దివ్యానుభూతి కలిగేది. నాలో మెదిలే అవిశ్వాసం స్థానే విశ్వాసం, భక్తిశ్రద్ధలు చోటు చేసుకున్నాయి. బాబా సన్నిధిలో కూర్చుంటే ఆకలి దప్పులు కూడా తెలిసేవి కావు. బాబాను పదే పదే చూడాలనిపించేది, ఆయన పలుకులను మళ్ళీమళ్ళీ వినాల నిపించేది. బాబాను దర్శించాలని వచ్చేవారితో ఇష్టాగోష్టిగా మా ట్లాడేటప్పుడు వారికి ఎదురయ్యే దివ్యానుభవాలను వింటుంటే బాబా ఆ పరిశుద్ధ పరమేశ్వర అవతారం తప్ప ఇంకొకటి కాదన్న నమ్మకం నాకు దృఢంగా కలిగింది. బాబా కూడా నన్ను పిలిచి బయటనుండి వచ్చే భక్తుల అవసరాలను చూడమని నాతో స్వయంగా చెప్పారు. అప్పట్లో ఎంతోమంది శిరిడీ వచ్చినప్పు డు మా ఇంట్లోనే భోజనం చేసేవారు, వారందరికీ నేనే స్వయా నా వండిపెట్టే వాడిని. క్రమక్రమంగా వారు నన్ను వారి ఇళ్ళకు ఆహ్వానించడం, నేను బాబా అనుమతితో వెళ్ళడం జరిగేది. ఒక్కొక్కసారి బాబా తన భక్తులను తన వద్దకు పిలిపించుకోవ డానికి నన్ను సాధనంగా వాడుతున్నారేమోనని అనిపించేది.
ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చిన భక్తులను నేను బాబా అనుమతి లేకుండా తీసుకువెళ్ళేవాడిని, అప్పుడు బాబా నాపై ఎంతో కోపంతో ”వీడు నా మీదకు మనుష్యులను ఉసిగొల్పుతు న్నాడు” అని అరిచేవారు కాని అంతలోనే శాంతించి భక్తులను ఆశీర్వదించి వారి అవసరాలను చూడమని నాతో చెప్పేవారు.
స్కూలు టీచర్‌గా ఉద్యోగం మానేశాక కొంతకాలం శ్యామా ఆ గ్రామంలో వైద్యునిగా పనిచేసాడు. తన వద్దకు వచ్చిన రోగుల కు బాబాను స్మరించి ఆయుర్వేద గుళికలను ఇచ్చేవాడు. బాబా వారించడంతో ఆ పనీ మానేసి పూర్తికాలం బాబా సేవకై వెచ్చించ

సాగాడు. ఒకసారి కాకాసాహబ్‌ దీక్షిత్‌ బాబాకు నమస్కరించి ”మీరు నాతో ఎల్లప్పుడూ వుండేలా అనుగ్రహంచండ”ని ప్రా ర్ధించాడు. అప్పుడు బాబా మందహాసంతో ”నా శ్యా మాను నీ దగ్గర వుంచుకో, శ్యామా నీ దగ్గర వుంటే నేను నీ దగ్గర వున్నట్లే” అన్నారు. అప్పుడు శ్యామా తన అనన్యమైన స్వామి పరాయణతత్వంతో బాబా #హృదయంలో ఎటువంటి స్థానం సంపాదించుకున్నాడో అందరికీ అర్ధమయ్యింది. ఆనాటి నుండి శ్యామాకు ఎక్కువ గౌరవం ఇవ్వడం ప్రారంభించారు. కానీ ఇవేవీ అర్ధం చేసుకోలేని అమాయక శ్యామా యధా విధిగా బాబాను తదేక దీక్షతో సేవించుకునే వాడు. శిష్యుడంటే శ్యామాలా వుండాలని అందరికీ అర్థమయింది.
బాబా మాధవరావును శ్యామా అని సంబోధిస్తే శ్యా మా బాబాను దేవా అని పిలిచేవాడు. భక్తులందరూ శిరిడీకి వచ్చినప్పుడు ముందుగా శ్యామానే కలిసేవారు. బాబాకు విన్నవించు కోవాల్సినవి ముందుగా శ్యామా కే చెప్పేవారు. శ్యామాను విడి చి బాబా వద్దకు నేరుగా వెళ్ళి న సందర్భాలు లేవనే చెప్ప వచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement