మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు
మామేవైష్యసి యుక్వైవమాత్మానం మత్పరాయణ:
(భగవద్గీత 9 వ అధ్యాయం 34 వ శ్లోకం)
ఓ అర్జునా, సదా నా చింతన యందే నీ మమస్సును లగ్నం చేయి. నాకు నిజమైన భక్తుడవు కమ్ము.నాకు సర్వశ్య శరణాగతి చేసి నాకు నమస్కా రం చెయ్యి. నన్ను అర్చించు.ఈ సాధన ద్వారా నా యందు నీ మనస్సును లగ్నం చేస్తే నన్ను తప్పక చేరగలవు అని ఈ శ్లోకం భావం.
భగవంతుని యందు భక్తి రసభావనే నానాటికి కలుషితమౌతున్న ఈ భౌతిక ప్రపంచ బంధముల నుండి విడివడడానికి ఏకైక మార్గం అని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా స్పష్టం చేస్తున్నాడు. పురాణాలలో భగవంతుని కోసం తపస్సు చేసిన దానవులు అనేకులు వున్నారు. వారు అద్భుతమైన వరాలు పొందినా చివరకు వారి కి మోక్షం లభించకపోగా చివర కు దుర్భరమైన మరణం ప్రాప్తించింది. ఇది కోరక ల తృష్ణతో చేసిన కారణంగా జరిగింది. భగవంతుడు ఈ శ్లోకం ద్వారా దానవు లలా కాకుండా చిత ్తశుద్ధితో, పరిపూర్ణమైన మనస్సుతో, నిష్కల్మషమైన చిత్తంతో, సంశ య స్వభావాలను విడిచి,సర్వశ్య శరణాగతి చేసి భగవదారాధన చేయమని సూచి స్తున్నాడు.ఏ రూపాన్ని ఆరాధించినా అది పరిపూర్ణమైన నమ్మకంతో చేయాలి.ఆ రూపాన్ని మనస్సులో ప్రతిష్టించుకొని , దానియందే మనస్సు లగ్నం చేసి ఆ నామ మే జపిస్తూ నిత్యం భక్తియుత సేవలో నిమగ్నం కావడమే అసలు సాధన. లౌకిక జీ వితంలో బ్రతుకుతున్నా నిష్కామంగా మన బాధ్యతలు నిర్వర్తిస్తూ , ఈ సంసా రం యొక్క వికారాలు మనలో ప్రవేశించకుండా, మనపై దుష్ప్రభావం చూపించ కుండా జాగరూకతో వుండాలి. శిరస్సు వంచి వినమ్రతతో తన మనోవాక్కాయ కర్మలన్నింటినీ దేవుని భక్తి యందే నియుక్తం గావిస్తే కొంత కాలానికి అప్రయత్నం గా భగవద్ భక్తి సిద్దిస్తుందని యోగసూత్రాలు చెబుతున్నాయి. భాగవతంలో సూచించిన శ్రవణ, కీర్తన, దాస్యం, ఆత్మ నివేదన ఇత్యాది నవ విధభక్తులలో ఏదైనా ఒకటి లేదా ఎక్కువ మార్గాలను మనం ఎంపిక చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, భక్తి అనే ఆయుధంతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. నవవిధ భక్తి మార్గముల ద్వారా తన #హృదయ మాలిన్యాన్ని తొలగించుకుంటే వారి పాపాలన్నీ స#హజంగా నశించిపో తాయి. భగవంతుని నిరంతర చింతన అతనిని పరమ పవిత్రునిగా చేస్తుంది. భౌతిక సంపర్కం నుండి నెమ్మదిగా విముక్తుడవుతూ నిత్య సత్యమైన పరబ్ర#హ్మ దర్శనా నికి అర్హత సాధించుకుంటాడు.అటువంటి శుద్ధ భక్తుల ఆవశ్యకత నేటి సమాజానికి ఎంతైనా వుందని భగవంతుడు పరోక్షంగా సూచిస్తున్నాడు. అటువంటి శుద్ధ భక్తుల రక్షణా భారాన్ని నేనే స్వయంగా వ#హస్తానని కూడా గీత ద్వారా వాగ్దానం చేసాడు ఆ గీతాచార్యుడు.