ఇక నారసింహావతారం. ఒకసారి నీవు అంతటా ఉన్నావని నిరూపించవయ్యా అని ప్రహ్లాదుడు ప్రార్థిస్తే అతని ఆర్తికి తగ్గట్లుగా స్తంభమున కనపడ్డాడు. బ్రహ్మ వరాలతో నాకు చావే లేదు అని గర్విస్తున్న హిరణ్యకశిపునికి నా సంకల్పానికి బ్రహ్మ వరం అడ్డే కాదు. బ్రహ్మ వరానికి భంగం రాకుండానే నిన్ను సంహరిస్తానురా. మీరంతా జీవులు. అల్పజ్ఞానము కలవారు. నేను సర్వజ్ఞుడను అని లోకానికి చాటాడు. హిరణ్యకశ్యపుని వరము బ్రహ్మ సృష్టించినవాటితో చావరాదు అని. అంటే బ్రహ్మను సృష్టించినవానితో చావు రావచ్చు కదా అని హిరణ్యకశ్యపుని అల్పజ్ఞతను, జీవుల ఆలోచనాసరళిని లోకానికి చెప్పాడు. కనపడవయ్యా అంటే కనపడ్డాడు. మూడు లోకాలను బాధిస్తున్న హిరణ్యకశ్యపుని వధించాడు. ప్రహ్లాదునికి వరాలు ఇచ్చాడు. ఇటువంటి వరాలు దుష్టులకీయరాదు అని బ్రహ్మకు గుణపాఠం చెప్పాడు. ఋషులకు పరమాత్మతత్త్వాన్ని బోధించాడు. ఇలా ఒకటి అడిగితే నాలుగిచ్చే ఔదార్యం స్వామిది.
(సశేషం)