Sunday, January 5, 2025

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇట్లు ప్రతి విషయమును ధర్మశాస్త్రానుగుణముగా ఆచరించి వ్యవహరించుట పుణ్యము. ధర్మశాస్త్ర విరుద్ధముగా ఆచరించుట పాపము. స్త్రీయందు కోరిక కలిగినపుడు ధర్మపద్ధతిలో వివాహము చేసుకొని భార్యతో శాస్త్రము చెప్పిన రీతిలో సుఖమును అనుభవించుట ఇంద్రియములకు తృప్తి, భగవంతునికి సంతోషము. పవలు స్త్రీతో రమించరాదు. అమావాస్య, పూర్ణిమ, అష్టమి, ఏకాదశి, దశమి, ద్వాదశి అట్లే స్త్రీ నపుంసక నక్షత్రములలో రమించరాదు. ఈ నియమాలతో వ్యవహరించటము ధర్మము. ఇట్లు ఆహారములో, వ్యవహారములలో బగవంతుడిచ్చిన ఇంద్రియాలను ఉపయోగించుచున్నపుడు భగవంతుడు చెప్పిన ధర్మశాస్త్రాన్ని కూడా తెలుసుకొని వ్యవహరించిననాడు శరీరమునకు, ఇంద్రియములకు తృప్తి కలుగును. భగవంతుని ఆజ్ఞను పాటించినందువలన భగవానునకు సంతోషము కలుగును. శాస్త్రము ఈ విషయమునే చెపుతుంది. నీవు యే పని చేయాలనుకున్నా, చేయుచున్నా, ఏమి మాట్లాడాలన్నా, ఏమి ఆలోచించాలన్నా ధర్మము కోసమే. ధర్మమును గురించే. ధర్మమును రక్షించుటయే పరమ ప్రయోజనము. ధర్మమును రక్షించుట పుణ్యము. రక్షించకుండా ధర్మమును కాదనుట పాపము.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement