Saturday, December 28, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

రాజులకు కూడా దండిరచవలసినవారిని దండిరచకపోవుట, దండిరచకూడనివారిని దండిరచుట దోషము, పాపము కలిగించును అని ధర్మశాస్త్రము చెప్పుచున్నది. తప్పు చేసినవానిని దండిరచనిచో ఒక పాపము. అతను తప్పు చేయుటకు అవకాశము కల్పించుట ఇంకొక తప్పు అని, తప్పు చేసినవారిని శిక్షించని రాజునకు రెండిరతలు పాపము సంక్రమించునని చెబుతున్నది శాస్త్రము. అందుకే రామాయణంలో వాలిని బాణముతో రాముడు కొట్టగా వాలి చాలా నిష్ఠురభాషణము చేసినపుడు, ‘రాజభిర్థృత దండశ్చ స్వర్గం యాంతిహి మానవాః’ అంటారు. తప్పు చేసినవారు రాజుచే శిక్షించబడి పాపములు తొలగి స్వర్గానికి వెళ్ళెదరు. నీవు తప్పు చేసినావు. నేను రాజుగా నిన్ను శిక్షించి నీ పాపాన్ని తొలగించి స్వర్గానికి పంపుచున్నాడు. ఇది నీకు ఉపకారమే, నాకు కర్తవ్యమే అంటాడు. అంతేకాదు, దండిరచవలసినవారిని దండిరచక దండిరచకూడనివారిని దండిరచిన రాజు పాపమును పొంది నరకమునకు వెళ్ళును. అందువలన నీకు నరకము తప్పించటమే కాదు, నీకు నరకం రాకుండగా నా ధర్మాన్ని నిర్వహించాను అంటాడు రాముడు. అందువలన పదే పదే తప్పు చేస్తానని పట్టుపట్టినవానితో ఆ తప్పు చేయించి, శిక్షించుట కూడా దండా కార్యమే. అనుమతించుట దండిరచుటయే అగును. దండిరచుట అతని పాపమును తొలగించి స్వర్గమునకు యోగ్యుని చేయుట దయాకార్యమే. రోగి రోగాన్ని వైద్యుడు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆరోగ్యాన్ని కలిగించుట దయాకార్యమే అగును. అందువలన దండిరచుట రక్షణలో భాగమే.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement