Friday, December 27, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

తన ఆజ్ఞను ధిక్కరించే కార్యమును చేయటానికి పూనుకున్నపుడు ఆ కార్యమునకు అడుగడుగునా విఘ్నములను కలిగించుచు వారించుచుండును. అయినా మనం ప్రయత్నం మానకుండా నేను తలపెట్టిన కార్యమును విజయవంతము చేయమని ఆ భగవంతుని ప్రార్థిస్తే అనుభవించేవానివి నీవే అని ఆమోదిస్తాడు. శాస్త్రమునకు విరుద్ధమైన కార్యమును అనుమతించటం మరి భగవంతునికి తగునా? వారించవచ్చును కదా లేదా దండిరచవచ్చును కదా అనగా అనుమతించటం కూడా దండిరచటమే. అది కోపముతో చేసినదే. తన శాసనాన్ని ఉల్లంఘించే పని చేస్తే దానికి తగిన శిక్ష భగవానుడు విధిస్తాడు కదా! అట్లు శిక్ష విధించటానికి అశాస్త్ర సంబంధిత కర్మలను ఆమోదిస్తాడు. తరువాత శిక్షిస్తాడు.
పరమాత్మ శాసనమునకు అనుకూలముగా ప్రవర్తించువానికి తరువాత హితమును కలిగించు పనులలో ప్రేరేపించును. తన శాసనమునకు వ్యతిరేకముగా ప్రవర్తించువారిని అహితమును కలిగించు కర్మలలో ప్రేరేపించును. అనగా అహితమైన కర్మలలో ప్రవర్తించువారి విషయమున ఉపేక్షకత్వము వహించినా అనుమతించినా ప్రేరేపించినా మరి భగవానునకు దయలేదు అనుకోవలసి వచ్చును కదా అనగా అయితే ఏమిటి? దయాగుణము, నిగ్రహము, దోషము అను నియమము లేదు. దయ చూపగూడనివారి విషయమున దయ చూపుట, దయ చూపకూడని సందర్భమున దయ చూపుట గుణమనిపించుకొనకపోగా దోషమే అనిపించుకొనును. అట్లే నిగ్రహించవలసినవారిని నిగ్రహించుట గుణమగును. నిగ్రహించకపోవుట దోషమే అగును. ఎంతగా బోధించినా, హెచ్చరించినా విననివానిని ఆ పని చేసే విధంగా ఆమోదించి, దానికి తగిన శిక్ష విధించి ఇటువంటి పని చేస్తే ఇలా ఫలితం ఉంటుంది అని తెలియచెప్పుట గుణమే.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement