Sunday, November 24, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

దశరథుడు రాముని అరణ్యయాత్రకు రాజలాంఛనాలతో, సైన్యంతో, కోశాగారంతో, పరివారంతో వెళ్ళు అంటే ‘గజే పరిత్యక్తే కక్ష్యాయాం కురుతే మనః, రజ్జు స్నేహేన కింతస్య త్యజతః కుంజరోత్తమం’ అంటాడు. యేనుగును దానం చేసి దాన్ని కట్టేసే తాడుమీద ఆశ ఎందుకు? యేనుగునే వదిలిపెట్టినవానికి రజ్జుస్నేహమెందుకు అన్నాడు. రాజ్యం ఏనుగు, పరిచ్ఛద పరివారం తాడులాంటిది అన్నాడు. తానేదో త్యాగం చేస్తున్నాను అనలేదు. ఈ రోజు నేను మీ ఆజ్ఞను పాలించటంలో పొందే తృప్తి సంతోషం రేపు నాకెవరిస్తారు అన్నాడు. నిజమైన తృప్తి, సంతోషం, ఆనందం, సుఖం నాన్నగారి ఆజ్ఞాపాలనలో. ఒక తానే కాదు, కౌసల్య నేను ఒప్పుకోను అంటే ఒక్క నేనే కాదు భర్తగా, రాజుగా అతని ఆజ్ఞను పాలించటం నీ విధి. నీవు ధర్మశిష్టురాలవుకమ్ము. పుత్రుని కోసం భర్తను వదలొద్దు. భర్తకోసం పుత్రుని వదలాలి అని ఆమెతో కూడా ఆజ్ఞాపాలన చేయించిన ఉదారుడు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement