ఒకరి సంపద ఇంకొకరి సంపదను హరించటానికి కాదు. సంపద లేనివానికి సహకరించటానికి. బలవంతుని బలం బలహీనుని పోషించటానికి, జ్ఞానం జ్ఞానం లేనివారికి జ్ఞానబోధ చేయటానికి. ఇది భగవంతుని ఔదార్యాల సూత్రాలు. కోట్లు లక్షలు, లక్షల కోట్లు సంపాదించి, దానితో ప్రపంచాన్ని పీడిరచటానికా? ప్రపంచం పీడిరచబడితే నీవు బాగుంటావా? ఇతరులను ఎట్లా పీడిరచాలా అని దిగులుతో నీవే పీడిరచబడుతుంటావు. అందుకే రాముడంటాడు ్ రాజు తన సుఖసంతోషాన్ని ప్రజలకు పంచాలి. ప్రజల దుఃఖాన్ని తాను తీసుకోవాలి అంటాడు. ఇది రాముని ఔదార్య లక్షణం. అసలు వృద్ధుడైన దశరథుణ్ణి తండ్రిగా ఎంచుకోవటమే ఔదార్యము కదా! ఇంకా చెప్పాలంటే పుత్రసంతానం కోసం దశరథ మహారాజు పుత్రకామేష్టి జరిపితే అందులో తన ఆహుతులు తీసుకోవటానికి దేవతలు వచ్చారు. బ్రహ్మ కూడా వచ్చాడు. అపుడు దేవతలు బ్రహ్మతో రావణాసురుని ధూర్తత్వమును, అహంకారమును తెలిపి తమ వరాల వల్లనే వాడిలా అయ్యాడు. మాకు గతేమిటి అని ప్రార్థించగా ఏమీ భయము లేదు. అతను అవధ్యత్వమును కోరుకున్నాడు. అయినా నరవానరులను చెప్పలేదు. అందుకే నరులతో, వానరులతో అతను వధించబడుతాడు అని చెప్పినాడు. నరవానరులు తమకు ఆహారము కదా! అందుకే వారిని చెప్పలేదు.
(సశేషం)