Friday, October 18, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

అట్లే జయవిజయులను సనకసనందనాదులు రాక్షసులుగా పుట్టండని శపించి భక్తులను అడ్డగిస్తే, అవమానిస్తే పరమాత్మ సహించడు అని పాఠం చెప్పారు. పరమాత్మ కూడా ‘న్యాయ్యోహి దండః కృతకిల్బిషేషు’ అని తప్పు చేసినవారికి దండన విధించాడు. న్యాయమే అని తన ఆమోదాన్ని తెలిపాడు. అంతేకాదు మూడు జన్మలలో విరోధముతో నిరంతరము నా నామాన్నే స్మరిస్తూ మరల నా వద్దకు చేరుతారు అని అనుగ్రహించాడు. భక్తుల కంటే శత్రువులే ఎక్కువ స్మరిస్తారు అని భగవంతుడు వారికి రాక్షసరూపములో కూడా శత్రుత్వములోనూ భక్తినే ప్రసాదించాడు. భగవంతుని ఔదార్యం చెప్పమంటే భక్తుల శాపాలను, వరాలను చెప్పుతున్నారేమిటి అని సందేహిస్తున్నారా? ఇదంతా పరమాత్మ ఔదార్యమే. సనక సనందనాదులు నారాయణ అవతారమే. నారదమహర్షి నారాయణ అవతారమే. ఇక అగస్త్యమహర్షి ఆయన అవతారమే. ఇలా ఇంచుమించు ఋషులందరూ పరోక్షముగా, ప్రత్యక్షముగా భగవానుని రూపాలే. అందుకే వారిచ్చిన శాపాలు, వరాలు కూడా భగవానుని ఔదార్యమే అని తెలుసుకోవాలి.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement