Thursday, November 7, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

పెద్దల ఆగ్రహాన్ని అనుగ్రహంగా మరల్చుకోవటమే పెద్దల సేవ అని చాటినవాడు పరశురాముడు. అనేక యజ్ఞాలను ఆచరించాడు. తండ్రికి హాని చేసిన క్షత్రియులను అంతమొందించి ఆ రక్తంతోనే పంచసరస్సులను అనగా పంచ ఆపః ఏర్పరిచి పంజాబ్‌ రాజ్యానికి వ్యవస్థాపకుడైనాడు పరశురాముడు. రాముడు రాగానే ఇక నీవు ధర్మరక్షణ ప్రారంభించు అని భారాన్ని అతనికి అప్పగించి వెళ్ళిపోయాడు. కృష్ణావతారంలో దుష్టసంహారంలో శ్రీకృష్ణ బలరాములకు సహకరించాడు. భీష్మునికి, ద్రోణునికి, చివరికి కర్ణునికి కూడా అస్త్రవిద్య నేర్పి పరశురాముడు గురువుగా తన ఔదార్యాన్ని చాటాడు. యజ్ఞం వలన పుట్టాడు. యజ్ఞం కోసం పుట్టాడు. అంటే సుదర్శనం అగ్నియే కదా! అతన్ని రక్షించటానికి నేనే ఆయుధం, నా సంకల్పమే ఆయుధం. నాకు ఇతర ఆయుధాలెందుకు? ఆ ఆయుధాలను అనుగ్రహించటానికే వాటిని ఉపయోగించు కుంటున్నాను. ఇదిగో ఆయుధాన్నే సంహరించాను అంటూ తన సత్యసంకల్పత్వాన్ని ప్రపంచానికి ఉపదేశించిన మహౌదార్య గుణశాలి పరశురాముడు. పరశురాముని వైభవాన్ని సమగ్రంగా చెప్పాలంటే పదివేల పేజీలైనా సరిపోవు. పరమాత్మ ఔదార్యం కదా! చదువరులకు ఆయాసం, అలసట లేకుండా ఇంతటితో పరశురామావతారాన్ని సుసంపన్నం చేసుకుందాం.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement