Friday, November 22, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

అతనే కార్తవీర్యార్జునుడు. వేయి చేతుల రేడు. ఇప్పటికే రావణాసురుని, వాలిని, ఇంకా పేరు పొందిన నరక వృష మొదలగు రాజులను ఓడిరచాడు. ధర్మపరిపాలకుడు. రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. అతని రాజ్యంలో దొంగలు లేరు. అతని రాజ్యంలో ఎవరూ తలుపులు తాళాలు వేసుకోరు. పొరబాటున దొంగతనం జరిగితే ఎవరైనా కార్తవీర్యా! నా వస్తువు పోయినది అంటే చాలు మరుక్షణం ఆ వస్తువు అతనికి లభిస్తుంది.
‘కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సాహస్రవాన్‌
తస్య స్మరణమాత్రేణ హృతం నష్టం చ విందతే’
అనునది అతని కీర్తి. ఈ మాత్రం జపం చేసినా పోయిన వస్తువు దొరుకుతుంది. అతను నాలుగు మహాయుగాలు పరిపాలిస్తాడు. అంటే 16 యుగాలు. ఇది 16వ యుగం అంటే ఈ యుగంలోనే అతని అంతం కావాలి. అంటే సుదర్శనుని కోరిక స్వామి తీర్చాలి. స్వామి ఇంకొక అవతారం ఎత్తాలి. ఆయన పుట్టాలి అంటే మరి ఆయనకు ఒక తండ్రి కావాలి. ఆ తండ్రి నాకు కుమారునిగా పుట్టాలి. ఇది స్వామి సంకల్పం. ఆ పుత్రుడు సత్యవతికి పుట్టాలి. అంటే ఆమె నా భార్య కావాలి. అందుకే నిన్ను ప్రార్థించాను కాని నాకు స్త్రీ వ్యామోహం కాదు’’ అన్నాడు ఋచీకుడు.
అద్భుతమైన వృత్తాంతం స్వామి లీలలను విన్న వరుణుడు చేతులు జోడిరచి అతను అడిగిన గుర్రాలను ఇచ్చాడు. అంటే అర్పించాడు.
ఆ అశ్వాలను గాధికి అర్పించాడు. గాధి తన కన్య సత్యవతిని ఋచీకమహర్షికిచ్చి వివాహం చేశాడు. ఇది పరమాత్మ సంకల్పంతో సుదర్శనావతారానికి పూర్వరంగమును సృష్టించి సుదర్శనస్వామిని అవతరింపచేసి లోకంలో దుష్టశిక్షణ శిష్టరక్షణకు పూనుకున్నాడు. తానే కాదు తన ఆయుధాలు, తన వాహనాలు,తన ఆభరణాలు, తన శరీరావయవాలు కూడా అవతరిస్తాయి. అవసరాన్నిబట్టి ఆ స్వామి తన లీలలను చూపుతారు. అందుకే పరమాత్మ నామము, వాహనము, ఆయుధములు, ఆభరణములు కూడా భక్తుల ఆర్తిని తొలగిస్తాయి. ఆయన ఉన్నదే ఆర్తిని తొలగించటానికి. ఇలా సుదర్శనుడు కార్తవీర్యునిగా అవతరించి మదోన్మత్తుల మదమును అణిచాడు. దుష్టులను తుదముట్టించాడు. దొంగల బాధ లేకుండా చేశాడు. అతనికి శక్తి ఈయటానికి స్వామి దత్తాత్రేయునిగా అవతరించాడు.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement