ఆదాయం 05, వ్యయం 05
రాజ్యపూజ్యం 03 అవమానం 01
గురువు 22.3.2023 ఉగాది నుండి 21.4.2023 వరకు మీనరాశి 12వ స్థానమై అశుభుడైనందున ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి.
శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం. 22.4, 2023 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 1వ స్థానమై సాధారణ శుభుడైనందున వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటు-ంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుట మంచిది.
శని 22.3.2023 ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 11వ స్థానమై శుభుడైనందున ప్రయత్నకార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటు-ంది. కుటు-ంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
రాహువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు మేషరాశి 1వ స్థానమై సాధారణ శుభుడైనందున విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటు-ంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటు-ంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. 31,10,2023 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 12వ స్థానమై అశుభుడైనందున ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి.వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
కేతువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు తులారాశి 7వ స్థానమై సాధారణ శుభుడైనందున అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్న సత్పలితాలు పొందుతారు.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.వృత్తి,వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ,సహాకారాల-కై- వేచివుంటారు. దైవ దర్శనం లభిస్తుంది.31.10.2023 నుండి సంవత్సరాంతం వరకు కన్యారాశి 6వ స్థానమై శుభడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు.తద్వారా లాభాలుంటాయి. విదేశియాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభముంటు-ంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.