Sunday, November 24, 2024

శ్రీ రాఘవేంద్ర స్వామి దివ్య చరితము


1 నమో నమో శ్రీ ప్రహ్లాదరాయ
నమో నమో శ్రీ రాఘవేంద్రాయ
నమో నమో నమో శ్రీగురురాయ
నమో నమో శ్రీవేంకటనాథాయ
2 మృగశిర నక్షత్ర జాతకులు
తిమ్మణ్ణ, గోపికాంబ పుత్రులు
తిరుమలేశుని వరపుత్రులు
వీణ వాయిధ్య గంధర్వులు
3 తండ్రి తనువు చాలించినపిమ్మట
అన్న గురురాజ చెంతనుండెను
మధురైలో మనుగడ సాగించెను
ప్రాథమిక విద్యను అభ్యసించెను
4 ద్వైత వేదాంత వ్యాకరణాదులు
సుధీంద్ర తీర్ధుల సన్నిధ నేర్చెను.
సరస్వతి బాయిని పెండ్లియాడెను
దివ్యమగు సుపుత్రుడు కల్గెను.
5 సర్వశాస్త్రములు సముపార్జించెను
మహాజ్ఞానులతొ భాష్యములాడెను
మూలరామ హనుమల పూజించెను
వేదశాలలో వేదము నేర్చెను
6 ఎవరి ఎదుటను చెయ్యిని చాచక
ఆలుబిడ్డలతో పస్తులుండెను
కట్టు-బట్టలా కరువై జీవము
దైన్యస్థితిని అనుభవించెను
7 కుంభకోణమున భోజనమునకు
భార్యతోడ ఆతిధ్యము కేగెను
తన దుస్థితిని కించబరుచుచు
గంధము నూరెడి పనిని ఇచ్చిరి
8 అగ్నిసూక్తమును ఉచ్ఛరించుచు
వేంకటనాథులు గంధము నూరెను
గంధము బూసిన వారలెల్లరు
మంటలు పుట్టి గంతులు వేసిరి.
9 చేసిన తప్పును గ్రహించి ఎల్లరు
శరణు శరణు అని స్వామిని వేడిరి.
వరుణసూక్తమును ఉచ్చరించుచు
వారితాపమును దూరము జేసెను
10 సుధీంద్ర తీర్థుల ఉత్తరాధిపత్యము
వేంకటనాథయె సరియని తలచిరి
స్వామి స్వప్నమున దైవము పలుకగ
సంకోచము వీడి సమ్మతించెను
11 ఫాల్గుణ శుద్ధ ద్వితీయ తిథిన
తంజావూరులొ సన్మనించిరి
సరస్వతిబాయి దుఖమునోర్వక
బావిలో దుమికి ప్రాణము వీడెనె

  1. ఆత్మహత్య అపచారముకాగా
    ప్రేతాత్మగా ఆమె మారెను
    స్వామి దర్శనము-కై- మఠము జేరగ
    శ్రీరాఘవేంద్రులు మోక్షము నొసగెను
    13 ద్వైతము జాటగ శ్రీరాఘవేంద్రులు
    దక్షిణ భారత యాత్రలు సల్చిరి
    శ్రీరాఘవేంద్రుల మహిమలనెరిగి
    స్వామికి ఎందరో శిష్యులాయిల
    14 తంజావూరుకు కరువు బ-్టట-ను
    రాజు కోరగా యజ్ఞము జరిపెను
    వానలు కురిసి కరువు బాసెను
    స్వామి మహిమలు ఎన్నోజపెను
    15 స్వామి ఘనతను నవాబు వినెను
    శ్రీగురురాయుని దర్శించెను
    పళ్లెములోని నీచము బెట్టి
    వస్త్రముగప్పి సమర్పించెను
    16 సర్వాంతర్యామి అది గమనించెను.
    మంత్ర జలముతో శుద్ధి చేసిన
    వస్త్ర ద్రిప్పగా ఫలములు గాంచగ
    నవాబు సిగ్గుతో తలను వంచెను
    17 ప్రహ్లాదుడు యజ్ఞము జేసిన
    పుణ్యస్థల మంత్రాలయ క్షేత్రము
    మరముకు నవాబు భూమినివ్వగ
    బృందావన నిర్మాణము జరిగెను
    18 జీవసమాధికి సమయము రాగా
    శ్రీరాఘవేంద్రులు ప్రసంగించెను
    ధర్మ సూక్తములు ప్రబోధించెను
    సమాధి నుండే పలికిననెను
    19 బ్రిటీ-ష్‌ ప్రభుత్వము మంత్రాలయమర
    విషయములెల్లయు తెలుపగోరుచు
    నాటి బళ్ళారి జిల్లా కలక్టర్‌
    థామస్‌ మన్రోను ఆదేశించెను
    20 విషయము కనుగొన థామస్‌ మన్రో
    వినయముగా బృందావని జేరెను
    శ్రీరాఘవేండ్రులు మన్రో కగుపడి
    సందేహముల నివృతజేసెను
Advertisement

తాజా వార్తలు

Advertisement