Tuesday, November 26, 2024

శ్రీరాముడికి ఆంజనేయస్వామి బహుమతి

శ్రీరామచంద్రమూర్తి రావణుడిని వధిం చి, సీతాదేవిని తీసుకుని అయోధ్యకు వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసుకుం టున్న శుభ సందర్భం అది. పట్టాభిషేకం అనంత రం శ్రీరామచంద్రమూర్తికి సామంతరాజులూ, బంధు వులూ స్నేహతులూ, భక్తులు మొదలయిన వారంతా కానుకలు తీసుకువచ్చారు. అందులో వానరరాజు సుగ్రీవుడూ, రాక్షసరాజు విభీషణు డూ, దేవతల రాజు ఇంద్రుడూ కూడా బహుమతు లు…. అంటే ప్రపంచములోనే అత్యంత గొప్పవైన వజ్రాలు, మణులు, రత్నాల్లాంటి అపురూప వస్తు వులు తీసుకువచ్చారు. ఇక సామంత రాజులు, రాజాధిరాజులూ ఏదో ఒక గొప్ప వస్తువు తీసుకు వచ్చారు. ఇంకా భక్తులూ, జ్ఞానులు అందరూ కానుకలు తెచ్చారు.
అందరిలోకీ పరమభక్తుడెన ఆంజనేయస్వామి పట్టాభిషేకం మూడు రోజులుందనగా మొదలు పెట్టాడు ఆలోచన, తన స్వామికి ఏమి కానుక సమ ర్పించుదామా అని. శ్రీ రామచంద్రమూర్తికి పరమ ప్రియమైనదీ, యెవ్వరూ తేనిదీ తీసుకురావాలని ఆయన వూహ. ఏ వస్తువును గురించి ఆలోచించి నా యెవరో ఒకరు తీసుకువస్తారు అనిపించింది. ఆంజనేయస్వామికి ఏమీ పాలుపోలేదు. ఆలోచి స్తూ కూర్చున్నాడు. రేపు ప్రొద్దున పట్టాభిషేకం- అట్టే సమయం లేదు. తెల్లారే లోపుగా ఆ కానుకేదో నిర్ణయించి తీసుకురావాలి. చటుక్కున యేదో జ్ఞాప కం వచ్చి లేచాడు ఆంజనేయస్వామి. తక్షణం రివ్వు మం టూ బ్ర#హ్మదేవుని దగ్గరకు వెళ్ళి వాలా డు. హనుమంతుడు వేళగాని వేళ రావడం చూచి అదరిపడ్డాడు బ్రహ్మ. ఏం కొంప మునిగిందో దేముడా అని భయపడి, ఆసనం చూపించి కూర్చోమన్నాడు.
ఉ#హూ, కూర్చోలేదు హనుమంతుడు. ”చాలా తొందర పనిమీద వచ్చాను. రేపు శ్రీరామచంద్ర మూర్తి పట్టాభిషేక మహోత్సవం. ఆయనకు కాను కగా సమర్పించటానికి సీతాదేవికి, శ్రీరామచంద్ర మూర్తికి పరమ ప్రియమైనది సృష్టించి యిస్తేగాని నిన్ను వదిలేది లేదు” అన్నాడు.
ఆంజనేయస్వామి అసాధ్యుడనీ, పట్టినపట్టు విడవడని బ్రహ్మకి తెలుసు. అయినా అర్ధరాత్రివేళ యీ కోతి పీడ యేమిటి అనుకున్నాడో ఏమో, బాగా ఆలోచించి అంతకుముందు సృష్టిలో లేనివి, అతి మధురంగా ఉండేవీ, రెండు పళ్లు సృష్టించి వాటికి సీతాఫలము, రామాఫలము అని పేరు పెట్టి అవి ఆంజనేయస్వామి చేతిలో పెట్టి ”వీటిని తీసు కువెళ్ళి మీ స్వామికివ్వు. చాలా ఆనందిస్తాడు” అన్నాడు. అంతే తక్షణం పయనమయ్యాడు.
పట్టాభిషేక సమయమయింది. హనుమాన్‌ ఎక్కడున్నాడా అని అయోధ్యంతా వెతికిస్తున్నాడు శ్రీ రామచంద్రుడు. యేమైనా కోపమొచ్చి అలిగాడే మో అనుకున్నాడు మదిలో. హనుమంతుడంటే పరమ ప్రేమ ఆయనకు. పట్టాభిషేకం జరుగుతున్న సంతోషమే లేదాయన ముఖంలో.
ఇంతలో హనుమంతుడు వచ్చాడు… అన్నారు అందరూ ఏక కంఠంతో. #హనుమంతుడు సరాసరి శ్రీరామచంద్రుడి పాదాలవద్ద వాలిపోయి రెండు చేతులతో రెండు ఫలాలూ సీతారాముల పాదాల వద్ద ఉంచి సీతాఫలము, రామాఫలము అని నమ స్కారం చేశాడు.
శ్రీరామచంద్రుడు హనుమంతుడ్ని కౌగలించు కుని ”మూడు రోజులనుండి కనపడటం లేదు, ఎక్కడున్నావు హనుమా?” అని అడిగాడు. హను మం తుడు జరిగినదంతా చెప్పాడు.
శ్రీరామునితో సహా సభలో వున్నవారంతా ఆశ్చ ర్యపోయారు #హనుమంతుని భక్తికి, శక్తికి. తరు వాత ఆ ఫలాలు రెండూ విడదీసి పెద్దలందరికీ పం చి పెట్టారు ప్రసాదంలాగా, అవి తిని వాటి మధురా నికి అంతా ఆశ్చర్యపోయి, హనుమంతుడ్ని పొగ డుతూ, గింజల్ని జాగ్రత్తగా పాతి పెట్టి మొక్కలు మొలిపించి కాయలు కాయించి అందరికీ సీతా రామ ప్రసాదంలాగా పంచిపెట్టారు. శ్రీరామచం ద్రుడు సీతాదేవీ ఎక్కువగా సంతోషించారు, ఆనా టి నుంచీ ఈనాటి వరకూ అందరూ యీ ఫలా లను ప్రీతిగా తింటారు. కానీ ఆ మధుర ఫలాలు భూలోకానికి రావడానికి మూలమైన హనుమను తలచుకోరు. ఇకనైనా స్వామి పేరును తలుచుకుని వాటి రుచిని ఆస్వాదిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement