తెలంగాణ ఇలవేల్పు యాదగిరిగుట్ట.. అంగరంగ వైభవంగా యాదగిరి నర్సన్న కళ్యాణం కనులారా తిలకించేందుకు ముక్కోటి దేవతలు యాదగిరి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా లక్ష్మీదేవి నరసింహాస్వామిల కళ్యాణం కనుల పండువగా నేడు (మంగళవారం) ఉదయం 11.00 గంటలకు వైభవంగా జరుగనున్నది. స్వామివారి కళ్యాణోత్సవ వేళ యాదాద్రి సర్వాంగ సుందరంగా శోభిల్లుతోంది. భక్త జనమంతా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఘట్టాన్ని కనులారా చూడాలని ఎదురు చూస్తున్నారు.
ఆధ్యాత్మిక కళా క్షేత్రము… ముక్కోటి దేవతల స్వర్ణ నిలయం. ఆధ్యాత్మిక దైవమందిరం.. దివ్య క్షేత్రం అయిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వర్ణ శోభితమైంది. విద్యుత్ దీపాల వెలుగులు విరజిమ్ముతూ క్షేత్ర పురం స్వర్ణ లోగిళ్ళలో ధగ ధగలాడు తుంది. అశేష భక్త జనాన్ని కనువిందు చేస్తున్నది. లక్ష్మీదేవి నరసింహస్వామి కళ్యాణ ఘడియలు రానే వచ్చాయి. ‘నమో నరసింహ’ మంత్రంతో యాదగి రిగుట్ట క్షేత్రం మారుమోగుతుంది.
”శ్రీకర, శుభకర, ప్రణభ స్వరూప, శ్రీలక్ష్మీ, నరసింహ నమో నమ:” అంటూ జయ జయ ధ్వానాలు మారుమోగుతున్నాయి. యావత్ భక్త జనం స్వామికి ప్రణమిల్లుతున్నది. స్వామికి నివేదించుకుంటే ఎంతటి కష్టాలు అయి నా తొలగిపోతాయని నమ్మకం. ఇక్కడ ఉగ్ర, గండభేరుండ, జ్వాల, యోగా నంద, లక్ష్మీ సమేత అయిదు రూపాలలో నరసిం#హుడిని కొలుస్తారు.
తెలంగాణ ప్రజల భాగ్యం
దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నది. లక్ష్మీ నరసింహ పుణ్యభూమిని దర్శంచుకోవడానికి సమస్త జనులు ప్రతి రోజు తరలి వస్తున్నారు. తెలంగాణ గడ్డ మీద లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉండటం తెలంగాణ జనుల భాగ్యం. యాదగిరి గుట్టలో ఎటు చూసినా భక్తిభావంతో జనం మనసు ఉప్పొంగుతుం ది. పదునాలుగు లోకములన్నీ మొక్కే జ్వాల నరసింహస్వామిని దర్శించడానికి భక్త జనులు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలి వస్తుండటంతో తెలంగాణ మట్టి పులకించిపోతున్నది.
అపురూప శిల్ప సౌందర్యం..
ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మితమైం ది. వేంచేపు మండపం, బ్రహ్మోత్సవ మండపం, అష్టభుజి ప్రాకార మండపాలను తీర్చి దిద్దారు. వంద సంవత్సరాలకు ముందు నిర్మించిన అనుభూతి భక్తులకు కలిగే విధంగా నిర్మించారు. ప్రస్తుత గర్భాలయాన్ని అలాగే ఉంచి దాని చుట్టూ గోడను నిర్మించారు. ఆల యంలోకి భక్తులు సులువుగా వెళ్లేందుకు వీలుగా ముఖ ద్వారాన్ని కూడా వెడల్పు చేశారు. గతంలో పదివేల మంది భక్తులకు వీలుండే చోటును ఇప్పుడు ముప్పయి నుంచి నలభైవేల మంది వచ్చిపోయేందుకు వీలుగా విస్తరించారు. గుట్ట మీద విష్ణు పుష్కరణి, గుట్ట కింద లక్ష్మీ పుష్కరిణి ఏర్పాటు చేశారు.
మూలవరులను ముట్టుకోకుండా పూర్తి కృష్ణశిలతో ప్రధానాలయ పునర్నిర్మాణం, కొండచుట్టూ పచ్చదనం, నీటిశుద్ధి నిర్వహణ, విద్యుత్తు వినియోగం, ప్రసాదాల తయారీపై 2022- 2025 సంవత్సరానికిగాను ఐజీబీసీ గ్రీన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ రేటింగ్ సిస్టం కింద యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు లభించింది. దేవాలయ ప్రాంగణమంతా 100 ఎల్ఈడీ లైట్ల వినియోగం అందరిని ఆకర్షిస్తోంది.
250 ఎకరాలలో నిర్మించే 250 కాటేజీలను నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు రకాల ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా నిర్మాణాలనీ భక్తి భావాన్ని పెంచనున్నాయి.
వంద ఎకరాల అడవి నృసింహ అభయారణ్యంగా అభివృద్ధి. స్వామివారి పూజల కు అవసరమైన పూలు, పత్రి ఇక్కడి నుంచే. అమ్మవారి పేరు మీద 50 ఎకరాల్లో కల్యాణ మండపం. యాదాద్రి టెంపుల్టౌన్తో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కాటేజీల నిర్మాణం, ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా, పవిత్రమైన భావన కలిగేలా ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా అత్యంత వైభవంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రహ్లాద, యాద మహర్షి తదితర ఆలయ చరిత్రకు సంబంధించిన పేర్లు. మినీ శిల్పారామం తరహాలో ఒక మీటింగ్ హాల్, స్టేజీ, స్క్రన్ ఏర్పాటు చేయనున్నారు. టిడిఎ కు అవసరమైన 2,157 ఎకరాల భూమి. దాని నిర్వహణను వైటిడిఎ అధికారులు చూసు కోనున్నారు.. ఈ భూమిలో ఆలయ అవసరాలు, పోలీసు శాఖ, ఫైర్ స్టేషన్, హల్త్ రవాణా పార్కింగ్ వంటి యాదాద్రి అభివృద్ధికి సంబంధించిన అనుబంధ సేవల కోసం. యాదా ద్రి పరిసరాలు అభివృద్ధి. హలీపాడ్ నిర్మాణం కూడా చేపట్టడం. టిడిఎ పరిధిలో ఉన్న 100 ఎకరాల అడవిని ”నృసిం#హ అభయారణ్యం” పేరిట అద్భుతంగా అభివృద్ధి చేస్తు న్నారు. స్వామివారి నిత్య పూజలు కల్యాణం అర్చనలకు అవసరమైన పూలు, పత్రాలు ఆ అరణ్యంలోనే అందుబాటులో ఉండేలా చర్యలు. 50 ఎకరాల్లో అమ్మవారి పేరుమీద ఒక అద్భుతమైన కల్యాణ మండపం నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు క్యూలైన్లు సహా ఇతర అన్నిచోట్ల ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు. దీక్షా పరుల మంటపం, వ్రత మంటపం, ఆర్టిసి బస్టాండు, స్టామ్ వాటర్ డ్రయిన్ల నిర్మాణం. దేవాలయం అభివృద్ధి కోసం రూ.43 కోట్ల నిధుల విడుదల చేశారు.
యాదగిరి క్షేత్రం చూస్తుంటే ఒకవైపు స్వర్ణ శోభిత నిలయంగా, అకుపచ్చ తోరణంలా భక్తి భావం పెంపొందుతుంది. నేడు జరిగే లక్షీదేవి, నరసిం#హస్వామి కళ్యాణం కనులారా చూద్దాం. శుఖం భుయాత్!