Monday, November 18, 2024

శ్రీకృష్ణుని అనుగ్రహ పాత్రుడు అక్రూరుడు

మన ఇతిహాస కథలలో కొన్ని ప్రత్యేకమైన పాత్రలు వున్నాయి. అందులో కొన్ని పాత్రలు ద్వంద్వ స్వభావాన్ని కనబరిస్తే మరికొన్ని పాత్రలు ఇరువర్గాలకు నష్టాన్ని కలిగించేలా వుండేవి. అటువంటి పాత్రలలో విచిత్రమైన రూపాన్ని కలిగినవాడు అక్రూరుడు. శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందినవాడు అయిన అక్రూరుడికి సంబంధించిన మహాభారతంలోని దివ్య ఘట్టాలను తెలుసుకుందాం.

మహారాజు కంసుడు శ్రీకృష్ణ బలరాములను హతమార్చాలనే లక్ష్యంతో వారిని మధురకు రప్పించాలని ధనుర్యాగం చేయ సంకల్పించి వారిని ఆహ్వానించడా నికి, తీసుకురావడానికి, రథ సారధిలా అక్రూరుడిని ఎంపిక చేస్తాడు. కంసుడు పంపగా మధురానగరం నుంచి ద్వారకకు వస్తాడు అక్రూరుడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ‘బృందావనం’లో వున్నాడని తెలిసి అక్రూరుడు ‘బృందావనంలో ప్రవేశిస్తాడు. తాను పూర్వజన్మలో చేసిన తపస్సు ఫలితంగానో, చేసిన దానాల పుణ్యంవల్లనో భగవంతు నితో భాషించడానికి అవకాశం కలిగిందని సంతోషపడుతూ శ్రీ కృష్ణ బలరాములను దర్శిం చాడు. వారి పాదాలకు నమస్కరించాడు. శ్రీకృష్ణుడు అతణ్ణి కౌగలించుకున్నాడు. శ్రీకృష్ణబల రాములు అతణ్ణి నందుని గృహానికి తీసుకుని వెళతారు. అక్రూరునికి కాళ్ళు కడిగారు. మధు పర్కాలు సమర్పించారు. భోజనం పెట్టించారు. నందమహారాజు సన్నిధిలో శ్రీకృష్ణుడు అక్రూరుని క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను గురించి అడిగాడు. వారిని గురించి వివరించమని పలికాడు. ఇక్కడికి వచ్చిన కారణమేమని అడిగాడు. అందుకు అక్రూరుడు నారద మ#హర్షి కంసుని వద్దకు వచ్చిన సంగతి, విరోధం పెరిగే మాటలను చెప్పి వెళ్ళడం, కంసుడు దేవకీవసుదేవులను చంపడానికి పూనుకొని మానుకోవడం, ధనుర్యాగం అనే నెపంతో కంసుడు తనను పంపించిన విధం బలరామకృష్ణు లకు వివరించాడు. అది విని బలరామకృష్ణుడు చిరునవ్వు నవ్వారు.
శ్రీకృష్ణుడు నందుడు మొదలైన పెద్దలతో ”గోపకులారా! ప్రభువైన కంసుడు ధనుర్యా గాన్ని చూడటానికి మనల్ని పిలుచుకరమ్మని ఈ అక్రూరుని పంపించాడు. కావున మనం వెళ్ళాలి. మీ శక్తికొలది మీమీ ఇండ్లలో పాలు, పెరుగు, నూతన వస్త్రాలు, కట్నాలు, కానుకలు సమకూర్చుకోండి. మధురానగరానికి యాత్రగా వెళ్ళాలి” అన్నాడు. మరునాడు నందగొల్ల పెద్దలతో అక్రూర స#హతుడై మధురానగరానికి పయనమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణబలరాములను తీసుకుని మధురకు వెళుతున్నాడు అక్రూరుడు. మధ్యాహ్నం అయింది. రథాశ్వాలకు అలుపు తీరుతుందని, అక్కడున్న పచ్చిక మేసి, నీరు తాగుతాయని కాళింది నదిలోని ఓ మడుగు దగ్గర రథం ఆపుతాడు అక్రూరుడు. ఆ మడుగు ఒడ్డునే ఒక కదంబ వృక్షం వుంది. ఆ చెట్టు నీడలో రథాని ఆపి ”వాసుదేవా? ఈ పుణ్యనదిలో స్నానం చేసి, సంధ్యావందనాలు నిర్వర్తించుకొని ఇప్పుడే వస్తాను. మీరు సుఖంగా రథంలో కూర్చోం డి. అని అక్రూరుడు కాళింది మడుగువైపుకు వెళ్లాడు. మళ్ళీ ఈ పుణ్యనదిలో స్నానం చేసే అవకాశం వస్తుందో రాదో అని భగవంతుని స్తోత్రం చేస్తూ తనివితీరా స్నానం చేస్తూ ఆ చల్లని నీటిలో ‘బలరామకృష్ణులను’ దర్శించాడు. చెట్ల మధ్యలో ఉన్న వీరు నీళ్ళలోనికి ఎప్పుడు వచ్చారు? అని ఆశ్చర్యపడి తలపైకెత్తి చూచి చెట్లనీడలో మునుపటివలె రథ మధ్యంలో కూర్చొని ఉన్న బలరామకృష్ణులను మరలా చూచాడు. అక్రూరుడు పులకించిపోతూ ఒక మునుగు మునిగాడు. అప్పుడు అక్రూరుడికి మహాద్భుతమైన ఒక దృశ్యం సాక్షాత్కరిం చింది. ఆదిశేషుణ్ణి పాన్పు చేసుకొని పవళించియున్న పురుషోత్తముణ్ణి చూచాడు. పులకించి పోయాడు. వారిని స్తోత్రాలతో ఆరాధించాడు. మంత్రపుష్పం పఠించాడు. మానసిక పుష్పా ర్చన చేశాడు. షోడశోపచారాలు సమర్పించాడు. శ్రీకృష్ణుడి చిరునవ్వులను తిలకించిన తన జన్మ ధన్యమైనదన్న భావనతో యమునా ఒడ్డుకు చేరి రథంవైపు చూశాడు. అక్కడ అన్న దమ్ములిద్దరూ అమితోత్సుకులై ఒకరిని ఒకరు చూసుకుంటున్న దృశ్యం చూస్తాడు. తాను చేసిన మానసిక పుష్పార్చన ఆ అన్నదమ్ముల పాదాల దగ్గర అక్రూరుడు చూస్తాడు. ఇంత మహాద్భుతం తనకు అనుగ్రహించిన పరమ పురుషుడు, భక్త వరదుడు అని అక్రూరుడు పరవశుడై మళ్లిd నదిలోకి దిగి అఘమర్షణ జపం చేస్తూ కొంతసమయం నీటిలో వుంటాడు. మళ్లిd ఆయనకు యమునానదీ జలాలలో ఆదిశేషుడి సింహాసన స్వరూపుడుగా, దానిమీద అధివహించినట్లు శ్రీకృష్ణుడు ఇంకొకసారి సాక్షాత్కరించారు. ఇప్పుడే కదా రథంలో కృష్ణ బలరాములను చూశాను. ఈ నదీజలంలోకి వీళ్లెలా వచ్చారు అని అక్రూరుడు విస్మయుడ వుతాడు. మళ్లి ఒడ్డుకు వెళ్ళి రథంలో చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్న సోదరులను చూస్తా డు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్రూరుడు కేసి దరహాస వదనంతో చూస్తూ ”ఇంత ఆలస్యం ఏమి టి? అక్కడ ఏమేమి వింతలు కనిపించాుం? నీ వదనంలో సంభ్రమాశ్చర్యాలు కనిపిస్తున్నా యి?” అని అడిగాడు. అక్రూరుడు పారవశ్యంతో ”మహాదేవా! నీకు తెలియని వింతలేముం టాయి? నీవే గొప్ప ఆశ్చర్య ప్రభావ సంపస్నుడవు? నీకు తెలియనిది ఏముంటుంది? నీవు రథంలో కూర్చునే నాకు యమునా జలాల్లో దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించావు. ధన్యోస్మి మహాపురుషా!” అంటూ నమస్కరించాడు.

హస్తినాపుర సందర్శనం

ఒకసారి శ్రీకృష్ణుడు పంపగా అక్రూరుడు ‘హస్తినాపురాన్ని” సందర్శించాడు. హస్తినా పురం సౌందర్యాన్ని చూసి ఆనందించాడు. రాజభవన ద్వారం వద్ద అతడిని భీష్మ పితామ హుడు, ధృతరాష్ట్రుడు సాదరంగా ఆహ్వానించి గౌరవిస్తారు. అక్కడ విదురుడు, కుంతీదేవిని, పాండవులు, ద్రోణాచార్యుడు, కృపాచార్యులు, దుర్యోధనుడు, కర్ణుడు, పాండవులు అంద రూ వుంటారు. అందరినీ అక్రూరుడు పలకరిస్తాడు. మధురానగరం కంసుని నిరంకుశత్వం నుండి విడుదలైనందుకు హర్షిస్తారు. భీష్ముడు కొంతకాలం హస్తినలో వుండని కోరతాడు.
కొన్ని నెలలపాటు హస్తినలో వున్న అక్రూరుడు హస్తినలోని పరిస్థితులన్నీ తెలుసుకుం టాడు. ఇక తాను వెళతానని అంటాడు అక్రూరుడు. భీష్ముడు అయిష్టంగానే అంగీకరిస్తాడు. బయలుదేరడానికి ముందు అక్రూరుడు ధృతరాష్ట్రునికి హితోపదేశం చేయాలని అనుకుం టాడు. భీష్ముడు, విదురుల సమక్షంలో ధృతరాష్ట్రునితో మాట్లాడాలని వెళతాడు.
”ధృతరాష్ట్ర మహారాజా! నీవు ఉత్తమ క్షత్రియ వంశంలో జన్మించావు. నీవు ధర్మంగా వ్యవహరిస్తే తగిన ప్రతిఫలం తప్పకుండా పొందుతావు. పాండవులను, నీ కొడుకులైన కౌర వులతో సమానంగా చూడటం మంచిది. ఏ అనుమానం లేకుండా పాండవులకు వారికి ఇవ్వ వలసిన భాగాన్ని పంచి ఇమ్ము. అందరూ సుఖంగా ఉండండి.” అని సలహానిచ్చాడు. ధృత రాష్ట్రుని అభిప్రాయాన్ని తెలిసికొన్న అక్రూరుడు ‘నీ ఇష్టం వచ్చిన రీతిలోనే ప్రవర్తించు ము’ అని చెప్పి తిరిగి మధురానగరానికి వచ్చి బలరామకృష్ణులకు సమాచారం అందించాడు.
అక్రూరుని చేరిన శ్యమంతకమణి

అక్రూర, కృతవర్మల ప్రోత్సాహంతో ‘శతధన్వుడు’ శ్రీకృష్ణుని మామ అయిన సత్రాజి త్తును చంపి ‘శ్యమంతకమణి’ని తీసుకువెళతాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుడు తనను చంపబూనాడని తెలిసి శతధన్వుడు శ్యమంతకమణిని అక్రూరుని వద్ద ఉంచి పారి పోయాడు. శ్రీకృష్ణుడు మిథిలానగర ప్రాంతంలో ‘శతధన్వుడి’ని చంపాడని అక్రూరుడు ద్వారక నుండి పారిపోయాడు. అక్రూరుడు పారిపోవడంతో ద్వారకలో వర్షాలు కురవలేదు. మహోత్పాతాలు పుట్టాయి. పెద్దల సూచనపై శ్రీకృష్ణుడు అక్రూరుని ద్వారకకు రప్పించాడు. అక్రూరుడు వచ్చి శ్యమంతకమణిని శ్రీకృష్ణునికి ఇచ్చాడు. అయితే ఆ మణిని తిరిగి అక్రూరు నికే బహూకరించి, ద్వారకలో ఆశ్రయం కల్పిస్తాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుంచి ద్వారకా నగ రం సముద్రంలో మునిగిపోయే వరకు అక్రూరుడు ద్వారకలోనే నివశించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement