53. కలలంచున్శకునంబు లంచు గ్రహయోగంబంచుసాముద్రికం
బు లటంచున్దెవులం్వచరిష్టమనుచున్భూతంబు లంచు న్విషా
దు లటంచున్నిమిషార్థజీవనములందున్బ్రీతి పుట్టించి యీ
సిలుగుల్ ప్రాణుల కెన్నిచేసితివయా? శ్రీకాళహస్తీశ్వరా! ,
( తెవులంచు దిష్టి యనుచున్–అనిపాఠాన్తరం కూడా ఉంది.)
ప్రతిపదార్థం:శ్రీకాళహస్తీశ్వరా!, నిమిష – అర్థ – అరనిమిషం ఉండే, జీవనములు – అందున్-బ్రతుకులలో, ప్రీతిన్ – ఇష్టాన్ని, పుట్టించి – కలిగేట్టు చేసి, కలలు -అంచున్ – కలలు అంటూ, శకునంబులు – అంచున్ – శుభాశుభాల సూచనలు అంటూ, గ్రహయోగంబు – అంచున్ – గ్రహాల కూటమి అంటూ, సాముద్రికంబులు -అట -అంచున్ – అరచేతిరేఖలు చూసి భవిష్యత్తుని చెప్పటం అంటూ, తెవులు-అంచున్ -రోగం అంటూ, అరిష్టము – అంచున్ – పీడ అంటూ, భూతంబులు -అంచున్ – పిశాచాదులుఅంటూ, విష- ఆదులు్శ అట- అంచున్ – విషాలు మొదలైనవి అంటూ, ఆ సిలుగుల్ – ఆ కష్టాలు, ఎన్ని -ఎన్నో (అసంఖ్యాకాలు), చేసితివి -అయా ్స కల్పించావు కదయ్యా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! అరనిముషం ఉండే బతుకుల మీద మానవులకి ఇష్టం కలిగేట్టు చేసి కలలని, శకునాలని, గ్రహాల కలయిక వల్ల వచ్చే ఫలితాలని, చేతిలోని గీతలు సూచించే భవితని, రోగాలని, అరిష్టాలని, దయ్యాలు, భూతాలు అని, విషం మొదలైన వాటి వల్ల కలిగే హాని అనిఅంటూ ఎన్ని కలిగించావయ్యా!
విశేషం: అసలు మానవ జీవితకాలమే అతిస్వల్పం. వచ్చే కష్టాలు అనంతం. బ్రతుకు మీది ప్రీతితో వాటిని పరిహరించు కోవటంలో ఆయుష్షు అయిపోతుంది. పరమార్థం గురించి ఆలోచించే తీరిక ఎక్కడ? సుఖానికి తావెక్కడ? ఇవన్నీ ఎందుకు కల్పించావు ? అనిశివుణ్ణే నిలదీస్తున్నాడు ధూర్జటి. మానవులు భగవత్సేవ చేయక పోవటానికి వారి తప్పుతో పాటు అల్పాయువు, అధిక కష్టాలు కారణం కనుక వారిని దయతలచ వలసిన అవసరం ఉంది. కనక, తన సేవ అల్పమైనా తనకు మోక్ష మీయమని భావం.
శ్రీ కాళహస్తీశ్వర శతకం
Advertisement
తాజా వార్తలు
Advertisement