Monday, November 11, 2024

షోడశ సంస్కారాలు

సం స్కారో నామ స భవతి యస్మి జ్ఞాతే పదార్థో భవతి యోగ్య:”
వ్యక్తిని లేదా పదార్థాన్ని ఒక నిర్ణీత ప్రయోజనానికి యోగ్య మైనదిగా చేసే ప్రక్రియనే సంస్కారం అంటారు (జైమినీ సూ త్రం). వ్యక్తిని శుద్ధి చేసేవే సంస్కారాలు. కొన్ని సంస్కారాలు వ్యక్తి క్షేమం, కుటుంబ ప్రయోజనం, కొన్ని సంతాన వృద్ధి, మరికొన్ని పశుసంపదను ఆశించేవి, మరికొన్ని సమాజ ప్రయోజనం కోసం జరిపేవి ఉంటాయి. భారతీయ సంప్రదాయంలో సంస్కారాలనే ఆగమ సంబంధిత క్రియ లు నిర్దేశింపబడి ఉన్నాయి. ఇలాంటివి హందూమతంలో ప్రధా నంగా 16 ఉంటాయి. వీటినే ‘షోడశ సంస్కారాలు’ అంటారు. ఇందులో మొ దటి మూడింటినీ జనన పూర్వ సంస్కారాలనీ, మిగతా పదమూడిం టినీ జననాంతర సం స్కారాలనీ అంటారు. గర్భాదానం, పుంసవ నం, సీమంతం, జాతకర్మ, నామకరణం, నిష్క్రమణ,అన్నప్రాశన, చూడాకరణ, కర్ణ వేధ, అక్షరాభ్యాసం, ఉపనయనం, వేదారంభం, కేశాంత, సమావర్తన, వివాహం, అం త్యేష్ఠి. ఇవి వ్యక్తి జీవితంలో జరుపబడే సంస్కా రాలు. వివాహమైనాక భార్యాభర్తల తొలి శారీ రక సమాగమంలో ఆరోగ్యవంతమైన, సత్సంతానాన్ని ఆశించి జరిపే సంస్కారం ‘గర్భాదానం’. ఈ సమయంలో పఠించే మంత్రాల అర్థాలు వంశాభివృద్ధికై భగ వంతుడిని ప్రార్థించడాన్ని తెలియ జేస్తాయి. ”సంధార్య తేయేన కర్మణాతత్‌ గర్భాదాన మిత్యాను గతార్థం కర్మ నామ ధేయం”. స్త్రీ భర్త ద్వారా తన గర్బ éమందు శుక్ర ధారణం చేయడాన్ని ”గర్భాదానం” అంటారు. మనిషి జన్మకు కారకమైన గర్భక్షేత్రాన్ని సంస్కరించ డమే గర్భాదాన సంస్కారము.
స్త్రీ గర్భవతి అయినట్లు తెలిశాక మొదట కొడుకు పుట్టాలనే ఉద్దే శంతో, చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు, చేసే సంస్కారం ‘పుంస వన హోమం’ అంటారు. గర్భిణి ఆ రోజంతా ఉపవాసం ఉంటుంది. ఆ రాత్రి మొలకెత్తిన మర్రి విత్తనాలను బాగా నూరి, వచ్చిన రసాన్ని ‘హర ణ్యగర్భ… అనే మంత్రాలు చెబుతూ, ఆమె కుడిముక్కులో వేస్తారు. ఇలాచేస్తే ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడని విశ్వాసం. గర్భం ధరిం చిన మూడవమాసంలోని మొదటి పదిరోజులలో చేయాలి.
తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే శిశువు దీర్ఘాయుష్షును కోరుతూ చేసే సంస్కారం ‘సీమంతం’. ఇక నాలుగవది ‘జాతకర్మ’ సంస్కారం. శిశువుకు బొడ్డుతాడు కోసేముందు చేసే సంస్కారాలూ ఉన్నాయి.
శిశువు జన్మించిన కొన్ని రోజులకు ‘నామకరణం’ అనే సంస్కారం చేస్తారు. ఆడ, మగ పిల్లలకు పెట్టే పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్యసూత్రాలు చెప్పాయి. పరాశర గృహ్యసూత్రాల ప్రకారం శిశువు పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవు ఉండి, హస్వ అచ్చుతో కూ డిన హల్లుతో మొదలై చివర దీర్ఘంకానీ, విసర్గకానీ ఉండాలి. అయితే వేరువేరు గృహ్య సూత్రాలలో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. శిశువుకు పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి. మొదటిది జన్మ నక్షత్రాన్ని బట్టి. రెండవది పుట్టిన భారతీయ నెల, రాశ్యాధిపతిని బట్టి. మూడవది ఇంటి ఇలవేలుపును బట్టి. నాలుగవది అందరూ పిలిచే పేరును బట్టి పేర్లు ఉంటాయి. బిడ్డడిని మొదటిసారిగా ఇంటి నుంచి బయటకు తీసుకురావడాన్ని ‘నిష్క్రమణ’ అంటారు. అప్పటి దాకా ఇంటిలో పెరిగిన శిశువు తొలి సారి బయట ప్రపంచంలో అడుగు పెడు తున్నప్పుడు ఆ బిడ్డను బలమైన, అతీత, ప్రకృతి శక్తుల నుండి కాపాడ డానికి ఆది భౌతికము, ఆధ్యాత్మికము ఐన చాలా జాగ్రత్తలు తీసుకోవా లి. అందుకే ఈ సంస్కారం ముఖ్యమైనదిగా భావిస్తారు.
సాధారణంగా బిడ్డడికి ఐదోనెలలో ‘అన్నప్రాశన’ చేస్తారు. పెరిగే బిడ్డకు భౌతికావసరాలు తీర్చడానికి ఘనాహారం ఇవ్వడం మొదలు పెట్టే ప్రక్రియ ఇది. సుశృతుడు కూడా శిశువుకు ఆరోనెలలో తల్లిపాలు మాన్పించి ఘన ఆహారం ఇవ్వాలన్నాడు.
దీర్ఘాయుష్షు, అందమైన రూపం కలగాలని ఆశిస్తూ చేసే సంస్కా రం ‘కేశ ఖండనం’ లేదా ”చూడాకరణ”/ తల వెంట్రుకలు తీయించ డం అంటారు. సుశృతుడు, చరకుడు కూడా పుట్టువెంట్రుకలు తీయిం చడం వలన అందం, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలుగుతా యని చెప్పారు. ఈ సంస్కారం బిడ్డ మొదటి ,మూడవ ఏటగానీ చేస్తారు.
చెవులు కుట్టించడం బిడ్డడికి ఐదేళ్ళ లోపు చేయవలసిన సంస్కా రం. దీనిని ‘కర్ణవేధ’ అంటారు. కర్ణాభరణాలు ధరించడం అం దంకోసమే కాక, ఆరోగ్య రీత్యా కూడా అవసరం. బిడ్డ డు కొంత మానసిక పరిపక్వత చెంది, క్రొత్త విష యాలు నేర్చుకోడానికి సిద్ధపడే సమయంలో చేసే సంస్కారాన్ని ‘అక్షరాభ్యాసం’ అంటా రు. మామూలుగా ఈ సంస్కారాన్ని బిడ్డడి ఐదవ ఏట చేస్తారు. విశ్వామిత్ర మహర్షి ఏడవ ఏట చేయాలని నిర్దేశించాడు. కొడుకును విద్యార్జన కోసం గురువు దగ్గ రకు పంపేముందు జరిపే సంస్కారాన్ని ‘ఉపనయనం’ అంటారు. ఉపనయనంతో వ్యక్తి రెండవ జన్మ ఎత్తినట్లవుతుంది. అం దుకే వడుగు అయిన వటువును ద్విజుడు అం టారు. అతి పవిత్రము, శక్తివంతము అయిన గాయత్రీ మంత్రాన్ని తండ్రి తన కొడుకు చెవి లో ఉపదేశి స్తాడు. ఉపనయన సమయంలో వటువు సూర్యునివైపు చూస్తుం డగా, ఆ బాలునికి బలం, తేజస్సు, దీర్ఘాయుష్షు, పవిత్రత కలగాలని భావిస్తూ, గురువు ఈ సంస్కారం నిర్వహస్తాడు.
అబ్బాయికి పదాహారేళ్ళ వయసు వచ్చాక మొదటిసారి గడ్డం గీసుకోడానికి సంబంధించిన సంస్కారాన్ని ‘కేశాంత’ అంటారు.
విద్యాభ్యాసం ముగిసి, గురుకులాన్ని వదిలి వెళ్ళేటప్పుడు నిర్వ హంచే సంస్కారాన్ని ‘సమావర్తన’ అంటారు. దీనికే ‘స్నాతకము’ అనే పేరు కూడా ఉంది. సమావర్తనతో విద్యాభ్యాసం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన యువకుని ముందర రెండు మార్గాలుంటాయి. ఉద్యో గం చేస్తూ, ధనం సంపాదించి, పెండ్లి చేసుకొని, గృహస్థ జీవితం గడప డం., గడించిన జ్ఞానంతో భౌతిక, మానసిక సంబంధాలకు దూరము గా, జపతపాలతో ఆధ్యాత్మిక జీవితం గడపడం రెండవది.
మొదటి మార్గం అనుసరించేవారిని ఉపకుర్వనులు అని, రెండవ మార్గంలో ఉన్నవారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం అనుసరించా లన్నా గురువు అనుమతి తప్పని సరి. తర్వాత జరుపబడే సంస్కారం ‘వివాహం’. వరునికి తగిన వధువును చూసి అతనికి పెండ్లి చేయడం వ్యక్తి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం.
ఇక మానవుని జీవితంలో ఆఖరుగా జరుపబడే సంస్కారం ‘అం త్యేష్ఠి’. చనిపోయిన వ్యక్తి కుమారులు అతని ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్ఠి అని అంటారు. వేద మంత్రాల మధ్య కొడుకు చేత కొరివితో నిప్పంటింప చేస్తారు. పద మూడు రోజుల కర్మకాండ అయ్యాక, అన్న సంతర్పణ చేయడంతో ఆ సంస్కారం పూర్తి అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement