Monday, November 18, 2024

”శివోహమ్‌ శివోహమ్‌”

”దేహో దేవాలయ: ప్రోక్తో
జీవో దేవ: సనాతన:
త్యజేదజ్ఞాన నిర్మల్యం
సోహం భావేన పూజయేత్‌”

శివ పూజా విధానాన్ని జగద్గురువైన ఆదిశంకరులు వివరించిన అద్భుతమైన శ్లోకమి ది. మన దేహాన్నే దేవాలయమని భావించి, అందులో ఉన్న జీవుడే దేవుడని గుర్తిం చి, ఎప్పటికప్పుడు మనలో పేరుకుపోతున్న అజ్ఞానమనే నిర్మాల్యాన్ని తొలగిస్తూ- ”సో హం” అంటే ”అతడే నేను”, ఆ భగవంతునికీ నాకూ భేదంలేదు అనే ధ్యాసతో శివపూజను చేయాలని మార్గదర్శనం చేసిన ఆచార్యవర్యుడాయన. ఆయన ప్రబోధించిన అద్వైత సిద్ధాం త సారాంశమిదే. ”అహం బ్రహ్మాస్మి” అంటూ బృహదారణ్యకం, ”అయమాత్మా బ్రహ్మా” అంటూ మాండూక్యోపనిషత్తు, ”తత్వమసి” అంటూ ఛాందోగ్యోపనిషత్తు, ”ప్రజ్ఞానం బ్రహ్మా” అంటూ ఐతరేయోపనిషత్తు… ఇలా అనేక ఉపనిషత్తులు ఉప దేశిస్తున్నదీ దీనినే.
ఇంత గహనమైన వే దాంత సారా

న్ని సామాన్యులకు వంట బట్టించుకోవడం కష్టమైన విషయమే. అందుకే జగద్గురు శం కరాచార్యులు మనకు నిర్వాణషట్కమనే పేరుతో ఆరు అమూల్యమైన శ్లోక రత్నా లను ప్రసాదించారు. అద్వైతాన్ని బోధించిన ఆచార్యవర్యుల పేరు, పరమేశ్వరుడైన శంకరుని పేరే కావడం మరింత విశేషం కదా!
‘వశిత్వం’ అన్నది అష్టసిద్ధులలో ఒకటి. (అణిమ, మహమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం.. వీటిని అష్ట సిద్ధులంటారు). వశిత్వం అంటే సకల జీవరాశులను, పంచభూతాలను (భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి), సకల విశ్వాన్నీ తన అధీనంలో ఉంచుకోవడం అని అర్థం. ‘వశి’ పదాన్ని తిరగవేస్తే ‘శివ’ నామం వస్తుంది. శివుడంటే మంగళప్రదాయకుడు, శుభదాయకుడు అని అర్థం. శంకరుడు అన్నా సుఖములను కలిగించువాడు అని అర్థం. లోకకల్యాణం కోసం విషాన్ని తన కంఠంలో దాచుకుని అమృతాన్ని జగత్తుకు ప్రసాదించిన వాడాయన. శివతత్వం- నిరాడంబరతను, నైర్మల్యాన్ని, స్వచ్ఛతను, చైతన్యాన్ని, భక్తిని, శక్తిని, ఆత్మశుద్ధిని, ధ్యానాన్ని, భోళాతనాన్ని, కరుణను బోధిస్తుంది. శివతత్వాన్ని అర్థం చేసుకుంటే సర్వమూ అర్థమైనట్లే. శివుడే మనమైనామంటే సర్వజ్ఞులమూ, పరి పూర్ణులమూ అయినట్లే. మరి మనం శివస్వరూపులం కావాలంటే, ‘శివోహమ్‌.. శివోహ మ్‌’.. అనే భావన.. విశ్వాసం బలపడాలంటే ఒకటే మార్గం.. నిత్యమూ నిర్వాణషట్కాన్ని అర్థం చేసుకుంటూ మననం చేస్తూ ఉండటమే.
ఆ ఆరు శ్లోకాలను, వాటి భావాలను ఒకసారి పునశ్చరణ చేసుకుందాం
”మనోబుధ్యహంకార చిత్తాని నాహమ్‌
న చ శ్రోత్వ జిహ్వా న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు:
చిదానందరూప: శివోహమ్‌ శివోహమ్‌”
మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము (అంతరింద్రి యాలు)- ఇవి నేను కాను. చెవి, నాలుక, ముక్కు, కళ్ళు మొద లన జ్ఞానేంద్రియాలు నేను కాను. పంచభూతములైన ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి.. నేను కాను. ఆ చిదానందరూపుడనైన శివుడను నేను.
”న చ ప్రాణసంజ్ఞోన వై పంచ వాయు:
న వా సప్తధాతు: న వా పంచకోశ:
న వాక్పాణి పాదౌ న చోపస్థ పాయు:
చిదానందరూప: శివోహమ్‌ శివోహమ్‌”
నేను ప్రాణములను కాను. (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములను పంచప్రాణాలం టారు) నేను పంచ వాయువులను ( నాగ, కూర్మ, కకల, ధనంజయ, దేవదత్తములు) కాను. నేను సప్త ధాతువులను (రస, రుధిర, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రములు) కాను. నేను పంచకోశములనూ (అ న్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞాన మయ, ఆనందమయ కోశములు) కాను. కర్మేంద్రి యాలు అయిన వాక్కు, పాణి, పాద, పాయు, ఉప స్థలనూ కాను. కేవలం చిదానందుడైన ఆ శివుడనే నేను.
”న మే ద్వేష రాగౌ, న మే లోభ మోహౌ,
మదో నైవ మేనైవ మాత్సర్య భావ:,
న ధర్మో నచార్థో నకామో నమోక్ష:
చిదానంద రూప: శివోహమ్‌ శివోహమ్‌”
కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను నేను కాను. ధర్మ, అర్థ, కామ, మోక్షా లనే పురుషార్థా లూ నేను కాను. నేను ఆ చిదానంద స్వరూపుడైన శివుడను మాత్రమే.
”నపుణ్యం, నపాపం, నసౌఖ్యం, నదు:ఖం
నమంత్రో, నతీర్థం, నవేదా, నయజ్ఞా:,
అహం భోజనం, నైవ భోజ్యం, నభోక్తా
చిదానందరూప: శివోహమ్‌ శివోహమ్‌”
పుణ్యపాపాలు, సుఖదు:ఖాలు నేను కాను. మంత్రాలు, పుణ్యక్షేత్రాలు, వేదాలు, య జ్ఞాలు.. ఇవేవీ నేను కాను. భోజనమును కానీ, భోజ్యమును కానీ, భోక్తనుకానీ నేను కాను. నే ను ఆ చిదానందమయుడైన శివుడను మాత్రమే.
”న మృత్యు ర్నశంకా నమే జాతిభేద:
పితా నైవ మే నైవ మాతా న జన్మా
న బంధు ర్న మిత్రం, గురు ర్నైవ శిష్య:
చిదానంద రూప: శివోహమ్‌ శివోహమ్‌”
నేను మరణాన్ని కానీ, మరణ భయాన్ని కానీ, మృత్యుశంకను కానీ కాను. నాకు జాతి భేదాలు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, గురుశిష్యులు వంటి భావనలు లేవు. అసలు నేను పుట్టుకనే కాను. (ఇక మరణాలు, బంధాలు ఎక్కడ?) నేను కేవలం ఆ చిదానందరూపుడైన శివుడినే తప్ప అన్యము కాదు.
”అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్‌
న చా సంగతం నైవ ముక్తి ర్నమేయ:
చిదానందరూప: శివోహమ్‌ శివోహమ్‌
నాకు ఎటువంటి సంకల్ప వికల్పములూ లేవు. ఆకారమూ లేదు. విశ్వమంతటా వ్యా పించి, అన్నిటికీ ప్రభుడనుగా అనిపించుటవలన నాకు సంబంధించని వస్తువులు కానీ, విష యాలు కానీ లేవు. ఇంకా నేను తెలుసుకొనవలసినవి కానీ, పొందవలసిన మోక్షము కానీ లే వు. నేను సర్వేశ్వరుడు, చిదానంద స్వరూపుడూ అయిన శివుడినే. నేను శివుడినే.. శివుడనే తప్ప వేరు కాదు.
ఎంతో దురవగాహమైన వేదాంత భావనను ఇంత సరళంగా, సూటిగా, సూక్ష్మంగా ఆ జగద్గురువులు తప్ప మరెవరు బోధించగలరు?
జాతి, మత, కుల, లింగ, వయోభేదాలు లేకుండా అందరమూ నిత్యమూ అర్థంతో పాటు మననం చేసి తీరవలసిన శ్లోకాలివి. ఇందులో ఆత్మతత్వం (అంటే శివతత్వం కూడా కదా) విశదీకరించబడి ఉంది కనుక ఈ ఆరు శ్లోకాలను ఆత్మషట్కం అనీ, వీటిని వంటబ ట్టించుకుంటే నిర్వాణం అంటే మోక్షం తప్పక కలుగుతుంది కనుక నిర్వాణ షట్కమనీ శంక రులు వీటికి నామకరణం చేశారు. ఆ జగద్గురువులకు త్రికరణశుద్ధగా ప్రణమిల్లుదాం.
”శృతి స్మతి పురాణానాం
ఆలయం, కరుణాలయం,
నమామి భగవత్పాదం
శంకరం, లోకశంకరమ్‌”————

Advertisement

తాజా వార్తలు

Advertisement