Saturday, November 23, 2024

శివానుగ్రహాన్ని ప్రసాదించే కాలభైరవ స్మరణం

కాలభైరవుడు! రుద్రుని అంశంలో పుట్టినవాడు. శ్రీ కాలభైరవస్వామి మార్గశిర శుద్ధ అష్టమినాడు అవతరించినట్లు శివమహాపురాణం చెబుతుంది. కాలభైరవుని జన్మదినమైన ఈరోజు కాలభైరవాష్టమిగా పిలుస్తారు. ఈ రోజు కాలభైరవస్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటుచేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను, అష్టోత్తరాలతోను శ్రీ కాలభైరవస్వామిని పూజిస్తారు. మినప వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకపూట ఉపవాసం చేస్తారు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకంను పారాయణ చేసి కాలభైరవస్వామిని స్మరిస్తూ సకల పుణ్యఫలాలు కలుగుతాయి. స్వప్న భయాలు దూరమవుతాయి. గ్రహదోషాలు తొలగిపోతాయి.
కాలభైరవస్వామి పుట్టుకకు సంబంధించిన ఆస క్తికరమైన గాథను ఈరోజు కాలభైరవాష్ట మి సందర్భంగా మననం చేసుకుందాం.
ఒకసారి ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరు అని సందేహం వచ్చింది. ఆ సందే హమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడు తన అయిదు ముఖాలు అయిన సద్యో జాత, అఘోర, తత్పురుష ఈశాన, వామదేవలతో ఋషుల వంక చూస్తూ ”అదేమిటయ్యా బ్రహ్మము ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును” అన్నాడు. అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకములన్ని టిని సృష్టించాను. నేనే నీ పుట్టుకకు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను. నేనే సంహా రం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నేనే బ్రహ్మమును’ అన్నాడు.
తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా అసలు నీవు పుట్టింది. నా నాభి కమలంలోంచి కదా, కావున నేనే బ్రహ్మమును అన్నాడు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందు కని వేదాలని పిలుద్దామని వేదాలని పిిలిచి అడిగారు.
అపుడు ఋగ్వేదం ఇలా చెప్పింది. ”ఈ సమస్త మునకు సృష్టికర్త, ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణు డు జన్మించాడో, ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో, అటు వంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము” అంది.
తరువాత యజుర్వేదమును పిలిచి అడిగితే ”అసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము” అని చెప్పింది.
సామవేదము ”మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో, ఎవరు ఈ లోకము నంతటిని తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పర బ్రహ్మము” అంది.
అధర్వణ వేదము”ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దు:ఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నా రో, అటువంటి పరమశివుడు పరబ్రహ్మము”’ అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనంకాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమా ణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి. ఆ తర్వాత ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ”ఎవరు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో, అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము” అని చెప్పింది.
ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ ”నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి” అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘శంకర ఏమి నీ ఆజ్ఞ’ అని అడిగాడు. ‘బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతు న్నాడు. ఆయన అయిదవ తలను గిల్లెయ్యి’ అన్నాడు. ఇప్పుడు ఈ స్వ రూపం ప్రచండ రూపము పొందింది. దిగంబరమై రూపంతో బ్రహ్మ అయిదవ తలను గోటి తో గిల్లేసింది. ఆ రూపమే కాల భైరవ స్వరూపం. దాంతో బ్రహ్మ భయపడిపోయి నాలుగు తలకాయలు అమ్మ వారి చేతుల క్రింద పెట్టేసి ”ఈశ్వరా, నాపొరపా టు మన్నించికాపాడు”అన్నాడు.
అపుడు శంకరుడు కాలభైరవునితో ”నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. కాలభైరవ నీవు ఎంత గొప్పవాడవయి నా బ్రహ్మ తల తెంపేశావు. కాబట్టి నీకు బ్రహ్మ హత్యా పాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి కపాలంలో తిను. నీ పాతకం పోతుంది.” అన్నాడు.
కాలభైరవుడు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యా పాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీమహా విష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న మహావిష్ణువు ‘కాల భైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మదేవుడి గర్వమును అణచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగంలేదు. కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీలో అడుగుపెట్టి నంతనే నీ బ్రహ్మ హత్యా పాతకం భస్మమైపోతుంది” అని సలహా ఇచ్చాడు. కాలభైరవుడు కాశీనగరానికి చేరుకోవడం తోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన ప్రదేశమే నేటి కాశీక్షేత్రంలోని ‘కపాల మోక్ష తీర్థం’.
కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్ని భక్తితో పూజించి తరించాడు. విశ్వ నాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. కాలభైరవ ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపబడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాల భైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. ఇక నుంచి నీవు నా దేవాలయములలో క్షేత్రపాలకుడవయి ఉంటావు. నీవు తీసిన భక్తుల పాపాలను ను వ్వు తినేయి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకు డు’ అనే పేరు ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను. నీ అను గ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తార”ని ఈశ్వరుడు కాలభైరవుడికి వరాలు ఇచ్చాడు. ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును కని భక్తితో ప్రణమిల్లుతారో, పూజిస్తా రో వారు శివానుగ్రహాన్ని పొందుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement