Monday, November 25, 2024

పోలవరం తవ్వకాల్లో శివలింగం

పోలవరం, ప్రభన్యూస్‌ : ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు లో స్పిల్‌వే ఎగువ భాగంలోని అప్రోచ్‌ చానల్లో గోదావరి నది ఒడ్డున మట్టి తవ్వకాల్లో దశాబ్దాల నాటి శివ లింగం బయట పడింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామమైన పాత పైడిపాక గోదావరి ఒడ్డున మెగా ఇంజినీరింగ్‌ సంస్థ మట్టి పనులను చేపడుతున్న నేపథ్యంలో అఫ్రోజ్‌ ఛానల్‌ వద్ద జెసిబి లతో మట్టి తవ్వకాలు జరుపు తుండగా భూగర్భంలో పురాతన ఇటు-కలతో నిర్మించిన నిర్మాణం ఒకటి జెసిబికి తగిలింది. దీంతో జేసీబీతో గట్టిగా లాగడంతో భారీ శివలింగం బయట పడింది. వెంటనే పనులను ఆపి విగ్రహాన్ని బయటకు తీసి గట్టు-పై పెట్టి విగ్రహాన్ని గోదావరి జలాలతో శుభ్రపరిచారు. శతాబ్దాల కాలం నాటిదిగా భావిస్తున్న ఈ శివలింగా న్ని అక్కడే ఉంచి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూ అంతర్భా గంలో పురాతన శివాలయం ఉండి ఉంటు-ందని, మరిన్ని దేవతా విగ్రహాల కట్టడాల అవశేషాలు బయటపడే అవకాశాలు న్నట్లు- భావిస్తున్నారు. పురావస్తు పరిశోధన శాఖ అధికారులు శ్రద్ధ వహించి తవ్వకాలు జరిపితే ప్రాచీన కాలపు దేవతా విగ్రహాలు ఆలయ అవశేషాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే స్థానికులు కొందరు బయటపడ్డ శివలింగానికి పూజాదికాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement