Wednesday, November 13, 2024

శివకేశవుల అనుగ్రహానికి ఉత్కృష్టం కార్తికం

స్కంద పురాణంలో కార్తిక మాసం గురించి
”నకార్తికే సమో మాసం..
న కృతేన సమం యుగం..
నవేద సద్రసం శాస్త్రమ్‌..
నతీర్థ గంగాయ సమం”
అని పేర్కొన్నారు. యుగాలలో కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైనటువంటి నది లేనట్టే మాసాల్లో కార్తిక మాసానికి సమానమైనదేదీ లేదని పెద్దల మాట. దీనిని బట్టి కార్తిక మాస విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కార్తీక మాసం సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తికమాసం అని చెపుతారు పెద్దలు.
”శివాయ విష్ణు రూపాయ
శివ రూపాయ విష్ణవే
శివస్య #హృదయం విష్ణో
విష్ణోశ్చ #హృదయం శివ:”

అంటే శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొ క్క రూపం శివుడు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు. విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు. అని వేదం చెబుతుంది. భగవంతుడు ఒక్కడే కానీ ఆయన రూ పాలు అనేకమని గ్రహంచాలి. ”చేతులారంగ శివుని బూ జింపడేని నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని, దయ యు సత్యంబు లోనుగా దలపడేని గలుగ నేటికి దల్లుల కడుపు జేటు” శివకేశవుల అద్వైతాన్ని- అభేద స్వరూపా న్ని స్ఫూర్తి. ‘ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైంది. ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏక భుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయా లు, తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చేయలేనివారు, దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది. కార్తిక మాసంలో భక్తులు నియమని ష్టలతో చేసే నోములు, వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈనెల రోజులు శైవక్షేత్రాలు భక్తుల శివనామ స్మరణతో మారుమోగిపోతాయి. శివపార్వతుల అనుగ్రహం కో సం భక్తులు విశేష పూజలు చేస్తారు. శివకేశవులకు ప్రీతి పాత్రమై ఈ మాసంలో చేసే పూజలు, నోములు వ్రతాల వల్ల జన్మజన్మాంతర పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివా లయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూ జలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తు లకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరు స్తాడని ప్రతీతి. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు’ అని పేరు వ చ్చింది. అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. కార్తికంలో శివార్చన చేసినవారికి గ్రహ దోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునికి శ్రీ వృక్ష పత్రము లతో (బిల్వదళములు) పూజిస్తే స్వర్గలోకంలో లక్ష సంవ త్సరాలు జీవించవచ్చునంటారు. పరమేశ్వరుడు ఎడమ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాల మంటారు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహనికి పాత్రులవుతారు. ఈ మాసంలో పుణ్య నదీ స్నానం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. మహళలు వేకువ ఝూమునే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధ చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్ర#తో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాల ను పొందుతారు. కార్తీక మాసమంతా స్నాన విధిని పాటించలేనివారు పుణ్య తిథులలోనైన స్నానం ఆచరిం చాలి. ఈ మాసంలో ప్రతి సోమవారంతో పాటు ఉత్థానైకా దశి, కార్తిక శుద్ధ ద్వాదశి, కార్తిక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తిక దీపం, రెండోది ఆకాశ దీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశ దీపం. ఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తికంలో దీప దానానికి ఒక విశిష్టత ఉన్నది. ఈ మాసంలో ఒకసారి దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుం ది. ఈ మాసంలో పౌర్ణమినాడు సత్యనారాయణ వ్రతం ఆచరిండం విశేషం. ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహతంగా దానం చేయడం, ఉసిరికాయ మీద వత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు. అన్ని మాసాల్లోకి విశేష మైన కార్తిక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారు. కార్తిక మాసానికి అధిపతి దామోదరుడు ఈ మాసంలో తులసి దళాలను ఈ శ్లోకం చదువుతూ శ్రీమహా విష్ణువును పూజిస్తే ముక్తిదాయకం.
”నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే
సహస్ర పాదాక్షి శిరోరుబాహవే
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే
సహస్రకోటీ యుగధారిణ నమ:” ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడ తాడు. ‘కార్తీక దామోద ర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్య నారాయణ స్వామి వ్రతం, విష్ణు సహస్రనామ పారాయ ణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది
– శ్రీధర్‌ వాడవల్లి

Advertisement

తాజా వార్తలు

Advertisement