శివుడు… భోళా శంకరుడు. శివుడు… భక్తవ శంకరుడు. పత్రం పుష్పం ఫలం తోయం…. వీటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలతో తనను కొలిచే ఆశ్రితులను ఆనందంగా అనుగ్రహిస్తాడు. జన్మానికో శివరాత్రి అంటారు గాని మహాశివరాత్రి పర్వ దినం ఏటేటా వస్తూనే వుంటుంది. మనస్సులో నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే వుంటుంది. త్రిమూర్తులలోనే కాదు సమస్త దేవతలలోనూ శివుడు భక్త సులభుడు. అందుకే ఆయనను భోళా శంకరుడని అంటారు. శంకరుడు భక్తవ శంకరుడు. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మధనం చేసే సందర్భంలో తొలుత హాలాహలం పుట్టింది. దాన్ని అలాగే విడిచిపెడితే అది ముల్లోకాల ను దహించివేసే ప్రమాదం వుండడంతో దేవదానవులం దరూ భీతావహులయ్యారు. హాలాహలం బారి నుండి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడి ని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మ్రింగి గొంతులో బంధించి గరళ కంఠుడ య్యాడు. హాలాహల ప్రభావానికి ఆయన కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందా డు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివుడిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవ డానికి క్షీరసాగర మధనంలో పుట్టిన చంద్రుని తలపై వుంచుకున్నా డు. నిరంతర తాపోపశమనం కోసం గంగమ్మను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా శివుణ్ణి హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే వుంటుం దట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ వుంటారు. హాలాహలం మ్రింగినపుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెళకువ వచ్చేంత వరకు జాగారం చేశారు. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్ధశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం వుంటారు. జాగారం వున్న సమయంలో శివ పంచాక్షరి జపిస్తూ శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాల తోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహా శివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికి లో వుంది. మన పురాణ సాహిత్యం క్రీ.శ.3వ శతాబ్ది నుంచి క్రీ.శ. 10వ శతాబ్దికి చెందినదిగా చారిత్రక ఆధారాలు వున్నాయి. మనదేశంలో శివారాధన మాత్రం శతాబ్దాల నుంచే పురాణాలకు ముందు నుంచే వాడుకలో వున్నట్లు చారిత్రక ఆధారాలు వున్నాయి. క్రీ.పూ.3000 ఏళ్ళ నాడే సింధూ నాగరిగత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. క్రీ.పూ.1500- 1200 నాటికి చెందిన ఋగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది. క్రీ.పూ. 4వ శతాబ్దికి చెందిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన చూడవచ్చు. ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపటిదని శివ పురాణం చెబుతుంది. అయితే ప్రస్తుతం వ్యాప్తిలో వున్న శైవారాధ న పద్ధతులు సాంప్రదాయాలు మాత్రం క్రీ.పూ.200 నుంచి క్రీ.శ.100 సంవత్స రాల మధ్య ప్రారంభమై వుంటాయని గావిన్ ప్లnడ్ వంటి చరిత్రకారులు విశ్లేషించారు. అతి ప్రాచీన శివాల యాలు అప్పటికే ఉనికిలో వున్నాయి. క్రీ.శ.7వ శతాబ్దికి చెందిన హ్యూయన్త్సాంగ్ భారత ఉపఖండంలో పర్యటించారు. హిందూఖుష్ పర్వత శ్రేణుల వద్ద వున్న సూరిస్తాన్ తదితర ప్రాంతాలలో శివాలయాలు తిలకించినట్లు తన రచనల్లో వివరిం చారు. క్రీ.శ.5-11 శతాబ్ద కాలం నాటికి దేశంలో తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో సైతం ప్రధాన శైవక్షేత్రాలలోని ఆలయాల నిర్మాణం జరిగింది. బాదామి ఎలిఫెంటాఎల్లోరా గుహా లయాలు ఖజరహూ, భువనేశ్వర్, చిదంబరం, మదురై, కంచి వంటి ప్రాంతాలలోని శివాలయాలు ఆ కాలానికి చెందినవే. అప్పటికే శైవమతం బాగా వ్యాప్తిలో వుండేది. క్రీ.శ.8వ శతాబ్దానికి చెందిన శంకరాచార్యుల కాలానికి శైవమతంలో పాశుపత, లకులీశ, కాపాలిక, తాంత్రిక శైవ అనే నాలుగు ప్రధాన శాఖలు కూడా ఏప్పడ్డాయి. మహా భారతం వంటి ఇతిహాసాలలో శైవ, వైష్ణవాల రెండింటి ప్రస్తావన వున్నప్పటికీ దక్షిణాదిలో వైష్ణవం కంటే శైవమే పురాతనమైనదని చరిత్రకారుల అంచనా. వైష్ణవానికి చెందిన వైఖానస వంటి ఆగమ సంప్రదాయా లను శైవమతం ప్రభావితం చేసింది. సనాతన మార్గంలోని శౌర, వైష్ణవ, శాక్తేయ మతాలకు చెందినవారు కూడా తమతమ ప్రధాన దేవతలతో పాటు శివారాధన చేసేవారు. ‘శివాయ విష్ణురూపాయ – శివ రూపా య విష్ణవే. శివన్య హృదయం విష్ణ్ణు: విష్ణోశ్ఛ హృదయం శివ:” అను శృతి ఈ శృతి ప్రకారం శివ కేశవులిద్దరూ శివ కేశవుల మధ్య భేదం లేదని ఇద్దరూ కలసి వున్న పురాతన ఆలయాలు భారత్లోనే కాక ఇతర దేశాలలో కూడా వున్నాయి. శౌర మతం వాయవ్య, తూర్పు భారత ప్రాంతాలలో వ్యాప్తిలో వుండేది. శైవానికి, శౌరానికి కూడా సాన్నిహిత్యం వుండేది. యోగ సాంప్ర దాయం లో శివుడిని ఆదియోగిగా పరిగణిస్తారు. చాలా శివాలయాలలో శివుడిని లింగ రూపంలో ఆరాధిస్తారు. శివుడిని మూర్తి రూపంలో ఆరాధించే ఆల యాలలో ఎక్కువగా శివుడు యోగ ముద్రలోనే కనిపిస్తాడు. నాదయోగ సాంప్రదాయంలో శివుడిని మత్స్యేం ధ్రనాధునిగా, గోరఖ్నాధునిగా ఆరాధిస్తారు. శివుడిని నాట్యాభినయ కళలకు ఆదిదేవుడిగా భావిస్తారు. నాదయోగులు ఆరాధించే మత్స్యేంధ్ర నాధుని బౌద్ధులు కూడా ఆరాధించడం విశేషం. నేపాల్ రాజధాని ఖాట్మండులోని శతో మత్స్యేంద్రనాథ ఆలయంలో హిందువులతో పాటు బౌద్ధులు కూడా పూజలు జరుపుతారు. బౌద్ధులకు చెందిన బోధిసత్వునిలో శివుని లక్షణాలు చాలా వరకు కనిపిస్తాయి. శైవం లోని తాంత్రిక ఆరాధన రీతిలోనే జైనులు తమదైన తాంత్రిక ఆరాధన పద్ధతిని ఏర్పరచుకున్నారు. పదకొండో శతాబ్దికి చెందిన జైనగ్రంథం ‘భైరవ పద్మావతి కల్ప’లో ప్రస్తావించిన పద్మావతికి శైవ శాక్తేయాలలోని త్రిపుర భైరవికి మధ్య పోలికలు కనిపిస్తాయి. శివుడు అభిషేకప్రియుడు. ఆయన ఎటువం టి ఆడంబరాలు నైవేద్యాలు కోరుకో డు. భక్తితో దోసెడు నీళ్ళు తనపై పోస్తే భక్తిపారవశ్యంతో తన్మయత్వం చెందుతాడు. శివరాత్రి రోజున ఓం నమ:శ్శివాయ అనే పంచాక్షరిని జపించి మహాదేవుని కటాక్ష వీక్షణాలు పొందుదాం.
Advertisement
తాజా వార్తలు
Advertisement