కశ్యపుడు, దితిల కుమారుడు వజ్రాంగుడు. వజ్రము వంటి అవయవములు కలవాడు, మహా బలశాలి. తల్లికి సంతోషాన్ని కలిగించడానికి ఇంద్రునితో సహా దేవతలను బంధించి దండించినవాడు. బ్రహ్మ నచ్చచెప్పి తన సామగానంతో వజ్రాంగుని సంతోష బెట్టి దేవేంద్రుని, దేవతలను వినిపించాడు. పరమ శివ భక్తుడైన వజ్రాంగుడు ఆత్మశుద్ధితో బ్రహ్మదేవునితో తన తల్లి ఆజ్ఞ మేరకు ఈ పని చేసానని చెప్పి, నాకు మీ తత్త్వసారము ను బోధించమని ప్రార్ధించాడు.
జ్ఞాన, సాత్త్విక, వైరాగ్యములే నా తత్త్వమని బోధించి వరాంగి అను కన్యను సృ జించి అతనికిచ్చి వివాహం జరిపించాడు. వజ్రాంగుడు వరాంగితో చాలా అన్యోన్యం గా ఉంటూ సాత్త్విక భావనతో ఆనందంగా తల్లి దగ్గర ఉండసాగాడు. కానీ వరాంగి మాత్రం సాత్త్విక భావనతో ఉండేదికాదు. భర్తను లాలిస్తూ తన కోరికను తీర్చమని అడి గింది. తనకు ముల్లోకాలను గడగడలాడించగల పరాక్రమశాలియైన పుత్రుడే కావా లని కోరింది. ఆశ్చర్యపోయిన వజ్రాంగుడు భార్య కోరిక తీర్చడం ధర్మము. భావించి నాడు. శివ సంకల్పము చేతనే ఈ కోరిక కోరినదని తలచి అటువంటి కుమా రుడు బ్ర#హ్మ తలచుకుంటేనే కాని కలుగడని తపస్సుచేసి బ్ర#హ్మను సాక్షాత్కరింప చేసుకొని వరాన్ని పొందాడు.
వజ్రాంగుని భార్య వరాంగి గర్భవతి అయినది. నెలలు నిండి ముల్లోకాలను గడ గడలాడించే కుమారుని కన్నది. ఆ బాలుడు పుట్టిన వెంటనే ముల్లోకాలలో ఉత్పాతా లు సంభవించాయి. ఉల్కలు వర్షించాయి, క్రూర జంతువులు అధికంగా పుట్టాయి, సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. సూర్యచంద్రుల చుట్టూ విచిత్రవలయాలు ఏర్ప డినాయి. భూమి కంపించింది, పక్షులు ఆకారణంగా నేలన పడి మరణించాయి. మేఘాలు రక్త వర్షం కురిపించాయి. ఇన్ని భయంకర దృశ్యాల నడుమ ఆ బాలుడు భయంకరంగా రోధించాడు. అతడే తారకుడు. పెరిగి పెద్దవాడైన తరువాత తల్లి ఆజ్ఞ తీసుకుని బ్రహ్మకొరకు తపస్సు చేసాడు.
కొన్ని వందల సంవత్సరాలు తీవ్రమయిన తపస్సు చేసాడు. అతని దేహం నుండి తపో అగ్ని మహా భయంకరంగా వెలువడసాగింది. ఆ సమయంలో వాయు భక్షణ మాత్రమే కలిగియున్నాడు తారకుడు. అతని తపస్సుకు ముల్లోకాలు తల్లడిల్లాయి. మహోపద్రవం వచ్చింది. అంత అందరూ సృష్టిని కాపాడమని బ్రహ్మను వేడుకొన్నా రు. వెంటనే బ్రహ్మ తారకునికి ప్రత్యక్షమై కోరిక ఏమిటని అడిగాడు. అంత తారకుడు రెండు వరాలను కోరాడు. ఒకటి తనకంటే బలవంతుడు, సమానమయినవాడు ఈ సృష్టిలో ఉండకూడదు. రెండు, శివ వీర్యము చేత జన్మించిన కుమారుని చేతిలో మా త్రమే తనకు మరణము అనుగ్ర#హంచమని వరాలు కోరాడు. ఆ రెండు వరాలను ప్రసా దించి బ్రహ్మ తన సత్య లోకానికి వెళ్ళిపోయాడు.
అప్పటికే శివుడు కామ వికారాన్ని కలిగించి మోహాన్ని ప్రసరింపచేసి అందరి తప స్సులను భ్రష్టు పట్టించే మదనుణ్ణి ద#హంచి లోకాలకు మేలు కలిగించాడు. అందు వలన శాశ్వత తపస్సులో ఉన్న శివ పరమాత్మ వివాహం చేసుకోడని, ఆయనకు సం తానం కలిగే అవకాశం లేదనే విశ్వానంతో పరమ శివభక్తుడైన తారకుడు రెండవ వరాన్ని కోరాడు.
వరాలను పొందిన తారకుడు అసురుడై ముల్లోకాలను జయించాడు. ఇంద్రుని పదవీ భ్రష్టుని గావించాడు. దేవతలు భూలోకాన్ని చేరి అడవులలో నివసించసాగారు. యజ్ఞాలు నిషేదించబడినాయి. తపస్సులు అనే మాటేలేదు. తారాకాసురుని సేనాపతి క్రౌంచాసురుడు ప్రతిరోజూ పాతాళ లోకానికి వెళ్ళి అక్కడివారిని నానా బాధలు పెడు తున్నాడు. దిక్పాలకులు ప్రతిరోజూ అతని ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉంటు న్నారు. స్థితికారుడైన విష్ణువు యొక్క సుదర్శనచక్రాన్ని అతను సుదర్శన మాలగా మా ర్చుకొని వేసుకున్నాడు. చివరకు తారకాసురుని బాధలు భరించలేక పితామహుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. అనేక విధాలుగా స్తుతించి బ్రహ్మతో మొరపెట్టుకున్నాడు. అంత బ్ర#హ్మదేవుడు నా వరాల వలననే వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. కావున వాణ్ణి సంహరించడం నా కర్తవ్యం కాదు. నా రెండవ వరం ప్రకారం శివుని వీర్యం చేత కల్గిన పుత్రుని చేతిలోనే మరణిస్తాడు. అందువలన హమవత్పర్వములలో తపస్సులోనున్న శివ పరమాత్మ ఒక్కడే మీ వేదనను తీర్చగలడు. అక్కడికి వెళ్ళమన్నాడు. అంత కుముందే దేవతలంతా దుర్గాదేవిని ప్రసన్నురాలిని చేసుకుని వరాన్ని పొందారు. కాముకుల ప్రవృత్తిని నివారించడం కోసం ఆయన శివలీలగా కాముని దహంచారు. నేను పార్వతిగా జన్మించి ఆయనను వివాహమాడుతానని దేవతలను వరాన్ని ప్రసా దించింది. సత్యలోకాన్నుండి కైలాసానికి చేరుకున్న దేవతలకు అక్కడ తపోనిష్టలో నున్న శివపరమాత్మకు పరిచర్యలు చేస్తూ పార్వతి కనిపించింది. ధ్యాన సమాధిలో నున్న శివుడు దేవతల ఆగమనాన్ని గ్ర#హంచలేదు. అప్పుడు దేవతలు మరియు విష్ణు వు పరిపరి విధాల పరమశివుణ్ణి స్తుతించసాగారు. శివపార్వతుల కళ్యాణం, వారికి సంతానం కలిగేలా చేయడమే ధ్యేయంగా శివదేవుని కీర్తించడం మొదలుపెట్టారు.
నమో రుద్రాయ దేవాయ మదనాంతకరాయచ
స్తుత్యాయ భూరి భాసాయ త్రినేత్రాయ నమోనమ:
విశ్వ ప్రకాశ స్వరూపుడు, మదముణ్ణి ద#హంచినవాడు, ముల్లోకాలచే స్తుతింప దగినవాడు, తేజోరూపుడు, మూడు కన్నులు గలవాడు, రుద్రునకు ఇవే మా అనేక నమస్కారాలు అని స్తుతించారు. భోళాశంకరుడు సమాధి నుండి వెలువడి కనులు తెరిచి ఏమిటని ప్రశ్నించాడు. అంత విష్ణువు తారకుని దురాగతాలు వివరించాడు. పార్వతి తపస్సును, పరిచర్యలను వివరించి పార్వతిని పరిణయమాడమని ప్రార్ధిం చాడు. అంత శివుడు ఇంద్రియ సుఖాలు అంతంలేనివి. మోక్షప్రాప్తికి విషయ సుఖాల ను విడిచిపెట్టి తపస్సునందు నిమగ్నులవ్వమని సూచించాడు. శివుని విరక్తి మాటల ను గ్రహించిన విష్ణువు శివస్తోత్రాన్ని మరింత దీక్షతో చెయ్యమని ఆజ్ఞాపించాడు. దేవగ ణమంతా శివస్తోత్రం చేసారు. చివరకు శివుడు త్వరలోనే మీ అభీష్టం నెరవేరుతుందని అభయం ఇచ్చాడు. తదుపరి సప్తర్షులు పార్వతిని పరీక్షించడం, శివుడే స్వయంగా బ్రహ్మచారి వేషంలో పార్వతిని పరీక్షించడం, శివుడు పార్వతి సంవాదం చేసుకోవ డం, హమవంతులకు సప్తర్షులు ఉపదేశం చేయడం మొదలగు అద్భుత సంఘటనల అనంతరం శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.