అవతారం అంటే ‘తార’. తార అంటే నక్షత్రం. ‘అవ’ అంటే దిగి రా వడం. జీవరాశుల అభ్యున్నతి కోసం నిర్హేతుక కృపతో భగవం తుడు స్వీకరించేదే అవతారం. ‘అవతారం’ అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమం టారు. దేవుడు అవతార మెత్తడం అనగా పైనుండే దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం. ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపు డు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచివాళ్లని రక్షించటానికి భగవంతుడు పశు పక్షి మనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని నమ్మకం. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వివిధ అవతారాలలో భక్తులకు దర్శనమి చ్చాడు. లోక కల్యాణార్థం ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో భక్తులకు దర్శన మిచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఈవిధంగా విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తి ప్రతి యుగంలోనూ ధర్మాన్ని నిలబెట్టాడు. అయితే లోక కల్యాణార్థం శివపార్వతులు కూడా పది అవతారాలు ఎత్తారు అని పురాణాలు చెబుతున్నాయి.
పరమ శివునికి అనేక నామములు ఉన్నవన్న విషయం మనందరికి తెలిసినదే. కానీ… అడిగిన వెంటనే వరాలిచ్చే భోళాశంకరుడు అయిన పర మ శివునకు కూడా విష్ణుమూర్తి వలె దశావతారములున్నవి. ఒక్కొక్క అవతారము ఒక్కొక్క ప్రయోజనం కలిగి ఉంటుంది. శతరుద్ర సంహతాల లో నందీశ్వరుడు, సనత్కుమారునకు ఈ ఈశ్వరావతారమును వివరిస్తాడు. మరి ఆ పది అవతారాలను తెలుసుకుందాం.…
శివుని ప్రధమ అవతారము మహాకాలుడు. మహాకాళి ఈ మహా కాలునికి భార్య. వీరిరువురు భక్తులకు భుక్తి, ముక్తిని ఇచ్చుచు వారి కోరికల ను నెరవేర్చుచుందురు.
ఈశ్వరుని ద్వితీయ అవతారము తారకావతారము. తారకాదేవి ఈయన అర్థాంగి. వీరిని సేవించినవారు భక్తి, ముక్తులతో పాటు సమస్త శుభ ములను పొందుదురు.
ముక్కంటి తృతీయ అవతారము బాలభువనేశ్వరావతారము. బాలభువనేశ్వరి భువనేశ్వరుని అర్థాంగి. ఈ అవతారము సత్పురుషులకు సుఖములను కలిగించును.
శంకరుని చతుర్థ అవతారము షోడశ విద్యేశ్వరుడు. షోడశ విద్యే శ్వరి ఇతని ధర్మపత్ని. భక్తులకు సర్వ సుఖములను ప్రసాదించుట ఈ అవ తార ప్రాశస్త్యము.
మహశ్వరుని పంచమ అవతారము భైరవావతారము. భైరవి ఇతని భార్య. ఈ భైరవుడు ఉపాసనాపరులకు సర్వ కామ్యములను ఒన గూర్చును.
మంజునాధుని ఆరవ అవతారము భిన్నమస్త. ఈతని అర్థాంగి భిన్నమస్తకి. వీరిరువురు భక్తకామప్రదులు.
భోళా శంకరుని సప్తమ అవతారము ధూమవంతుడు. ధూమవ తి ఇతని భార్య. వీరిరువురు భక్తకాభీష్టప్రదులు.
పరమ శివుని అష్టమావతారము బగళాముఖుడు. ఇతని అర్థాం గి బగళాముఖి. ఈమెకే మహానంద అని మరియొక పేరు కూడా కలదు. వీరు భక్తవాంఛాప్రదులు.
ఉమామహశ్వరుని నవమావతారము మాతంగుడు. మాతంగి ఇతని భార్య. వీరీరువురు భక్తుల సర్వకాంక్షలను ఈడేర్చుచుందురు.
కైలాసవాసుని దశమావతారము కమలుడు. కమల ఇతని భార్య. వీరిరువురు భక్తపాలకులు.
ఈ దశావతారములు ‘శివశక్తి మతోరభేద:’ అన్న సిద్ధాంతమును మనకు తెలియబరుచుచున్నవి. వికార రహతులై ఏకాగ్రతతో సేవించిన వారికి సమస్త సుఖములు కలిగి సమస్త కోర్కెలు సిద్ధించును.
ఈ అవతారములన్నియు తంత్ర శాస్త్ర గర్భితములు. ఈ దేవతాశక్తు లు దుష్టులను దండించుచూ భక్తులకు బ్రహ్మతేజోభివృద్ధిని కలిగించు చుండును.
అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలే దు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చు.
శివ పర్వ దినములందు, ముఖ్యంగా కార్తికమాసంలో ఈ అవతా రములను స్మరించినచో భక్తులు బ్రహ్మ వర్చస్సు కలవారైన విజయవం తులు, ధనాడ్యులు సుఖవంతులు అవుతారని నందీశ్వరుడు పలికెను.
మహాత్ముడగు శంకరుని ఈ పది అవతారములను వికారములు లేకుండగా నిత్యము సేవించు వారికి అనేక సుఖములు లభించును. శివ భక్తులు తమ ధర్మమును పాటిస్తూ ఈ చరితమును వినుచున్నచో విశేష సుఖమును పొందెదరు. వారి భక్తి వర్ధిల్లును.
శివపార్వతుల దశావతారములు
Advertisement
తాజా వార్తలు
Advertisement